S Jai Shankar : అభివృద్ది చెందిన దేశాలు చ‌ర్చ‌లు ఒప్పుకోవు

సుబ్ర‌మ‌ణ్యం జై శంక‌ర్ షాకింగ్ కామెంట్స్

S Jai Shankar : భార‌త దేశ విదేశాంగ శాఖ మంత్రి సుబ్ర‌మ‌ణ్యం జై శంక‌ర్(S Jai Shankar) సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న ప్ర‌ధానంగా అభివృద్ది చెందిన దేశాల గురించి కీల‌క వ్యాఖ్య‌లు చేయ‌డం క‌ల‌క‌లం రేపింది. ప్ర‌ధానంగా అభివృద్ది చెందిన దేశాలు సాధ్య‌మైనంత వ‌ర‌కు చ‌ర్చ‌లు జ‌రిపేందుకు ఇష్ట ప‌డ‌వ‌ని పేర్కొన్నారు.

వాళ్లు చెప్పిందే వినాల‌ని అనుకుంటారు. కానీ ఈ ప్ర‌పంచంలో ఇత‌ర దేశాలు కూడా ఉన్నాయ‌న్న వాస్త‌వాన్ని వారు గుర్తించ‌డం లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. కార్బ‌న్ స్థ‌లాన్ని ఆక్ర‌మించేవ ఆరు ఇత‌రుల‌కు స‌హాయం చేస్తామ‌ని ప‌లుమార్లు వాగ్ధానం చేస్తూనే ఉన్నాయ‌ని , కానీ వాటిని నిల‌బెట్టు కోవ‌డంలో ఫోక‌స్ పెట్ట‌డం లేద‌న్నారు జై శంక‌ర్.

కొత్త వాద‌న‌ల‌తో, అసంబద్ద‌మైన కార‌ణాల‌తో ప్ర‌తిసారి త‌మ‌ను తామ‌ను స‌ర్దిపుచ్చుకునేందుకు ఎక్కువ‌గా ఫోక‌స్ పెడుతున్నారంటూ వాపోయారు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి. దుబాయ్ లో జ‌రిగిన ఇండియా గ్లోబ‌ల్ ఫోర‌మ్ లో సుబ్ర‌మ‌ణ్యం జై శంక‌ర్(S Jai Shankar) ముఖ్య అతిథిగా పాల్గొని ప్ర‌సంగించారు.

వాతావ‌ర‌ణం క‌లుషిత‌మై పోతోంది. ప‌ర్యావ‌ర‌ణం దెబ్బ‌తింటోంది. కానీ దానిని ప‌రిర‌క్షించుకునేందుకు మాత్రం అభివృద్ది చెందిన దేశాలు ముందుకు రావ‌డం లేద‌న్నారు. ఇది కావాల‌ని చేస్తున్న‌ట్లుగా అనిపిస్తోంద‌న్నారు జై శంక‌ర్. ప్ర‌పంచ ప‌ర్యావ‌రణానికి నిజంగా బాధ్యులు ఎవ‌రో మీకంద‌రికీ తెలియ‌దా అని ప్ర‌శ్నించారు.

ప్ర‌తి ఒక్క‌రికీ తెలుసు. ఎవ‌రు హాని క‌లిగుస్తున్నారో వారే నీతి క‌థ‌లు చెబుతున్నారంటూ ఎద్దేవా చేశారు. ఇదిలా ఉండ‌గా కేంద్ర మంత్రి చేసిన ఈ వ్యాఖ్య‌లు క‌ల‌క‌లం రేపాయి.

Also Read : భ‌విష్య‌త్తులో భార‌త్ ను త‌ట్టుకోలేం

Leave A Reply

Your Email Id will not be published!