YS Jagan : మౌలిక వసతుల కల్పనతో అభివృద్ది
ఏపీ సీఎం సందింటి జగన్ మోహన్ రెడ్డి
YS Jagan : ఆరోగ్య కరమైన పెట్టుబడుల ద్వారా మౌలిక సదుపాయాలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు ఏపీ సీఎం సందింటి జగన్ మోహన్ రెడ్డి(YS Jagan). దీని వల్ల ఆర్థిక వ్యవస్థ పురోగించే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ 8వ సదస్సులో వైఎస్ జగన్ ప్రసంగించారు. భారత దేశంలో లాజిస్టిక్స్ ఖర్చు ఎక్కువగా ఉందని, దీనిని తగ్గించేందుకు ప్రయత్నం చేయాలని సూచించారు. జీడీపీలో దీని కోసం ఏకంగా 14 శాతం ఖర్చు అవుతోందని చెప్పారు సీఎం. భారతీయ ఉత్పత్తులు ప్రపంచ స్థాయిలో పోటీ పడేందుకు ఇది ప్రతిబంధకంగా మారిందన్నారు.
అమెరికాలో చూసుకుంటే లాజిస్టిక్స్ ఖర్చు కేవలం 7.5 శాతానికి పరిమితం అయ్యిందన్నారు. గడిచిన తొమ్మిదేళ్లలో సరకు రవాణా కారిడార్లు , జాతీయ రహదారులపై ప్రభుత్వం ప్రశంసనీయమైన రీతిలో ఖర్చు చేస్తోందన్నారు జగన్ రెడ్డి. ఆశించిన ఫలితాలను సాధించాలంటే దీన్నికొనసాగించక తప్పదన్నారరు. ఏపీ ప్రభుత్వం పోర్టు ఆధారిత అభివృద్దికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని స్పష్టం చేశారు సీఎం. రాష్ట్రంలో కొత్తగా 4 కొత్త పోర్టులు, 10 షిప్పింగ్ హార్బర్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
కర్నూల్ లోని ఓర్వకల్లులో ఎయిర్ పోర్టును అభివృద్ది చేశామన్నారు. విశాఖ పట్నంలో అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ ను కూడా పీపీపీ పద్దతిలో నిర్మిస్తోందని చెప్పారు. దేశంలో జీడీపీ తయారీ , సేవల రంగం వాటా 85 శాతం దాటినప్పుడే వికసిత్ భారత్ లక్ష్యం నెరవేరుతుందని అన్నారు జగన్ రెడ్డి.
వ్యవసాయ ఉత్పాదకతను పెంపొందించడానికి కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రోత్సహించడం చాలా అవసరం.ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏపీ గత మూడేళ్లుగా దేశంలోనే నెంబర్ వన్ గా నిలుస్తోందన్నారు సీఎం.
Also Read : Perni Nani Chandrababu
