Devendra Fadnavis : ఊహించని ట్విస్ట్ ఫడ్నవీస్ కు షాక్
అయిష్టంగానే డిప్యూటీ సీఎంగా ప్రమాణం
Devendra Fadnavis : మహారాష్ట్ర రాజకీయాలలో ఊహించని పరిణామం చోటు చేసుకోవడం విపక్షాలనే కాదు అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ వర్గాలను సైతం విస్తు పోయేలా చేసింది.
చివరి క్షణం వరకు ఉత్కంఠ రేపిన మరాఠా సీఎం పదవి అనుకోని రీతిలో శివసేనలో ధిక్కార స్వరం వినిపించిన ఏక నాథ్ షిండేకు దక్కింది. తాను వెనుక నుంచి సపోర్ట్ చేస్తానని , కేబినెట్ లో భాగం కాలేనంటూ ప్రకటించారు స్వయంగా ఫడ్నవీస్(Devendra Fadnavis).
కానీ భారతీయ జనతా పార్టీ హైకమాండ్ కోలుకోలేని రీతిలో షాక్ ఇచ్చింది. ఇప్పటి దాకా బీజేపీ అంటేనే ఫడ్నవీస్. చివరి దాకా ఈ మొత్తం వ్యవహారం వెనుక ఉన్నారనేది బహిరంగ రహస్యం.
కానీ తప్పని పరిస్థితుల్లో డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయాల్సి వచ్చింది. గతంలో ఆయన రెండుసార్లు సీఎంగా ఉన్నారు. మొదటిసారి పూర్తి కాలం ఉండగా రెండోసారి కేవలం నాలుగు రోజులు మాత్రమే పని చేశారు.
ఇదిలా ఉండగా ఆఖరులో ఉన్నట్టుంబి బీజేపీ చీఫ్ జేపీ నడ్డా ఫడ్నవీస్ ను డిప్యూటీ సీఎంగా ఉండాలని కోరడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో ఫడ్నవీస్ ఒప్పుకోవాల్సి వచ్చింది.
ప్రస్తుతం ఫడ్నవీస్ ఏక్ నాథ్ షిండేకు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఇది ఆయనకు మింగుడుపడని వ్యవహారం. కానీ కేంద్రంలో బలమైన నాయకత్వం ఉంది.
వారిని కాదని ఫడ్నవీస్ ఒక్క అడుగు ముందుకు వేయలేడు. కిమ్మనకుండా ఉండాల్సిందే. పోనీ ఎదురు చెప్పనూ లేడు. చివరకు పార్టీ ఆదేశాలను పాటిస్తానంటూ చెప్పారు ఫడ్నవీస్.
Also Read : అట్టడుగు నుంచి అత్యున్నత స్థానం