Devendra Fadnavis : దేవేంద్ర ఫడ్నవీస్ మొదటి అగ్నివీర్
డిప్యూటీ సీఎం పదవిపై పెదవి విరుపు
Devendra Fadnavis : మహా వికాస్ అఘాడీ ప్రభుత్వాన్ని కూల్చి వేసిన తెలివిగల ఎత్తుగడలతో ఘనత సాధించిన ఒక రోజు తర్వాత దేవేంద్ర ఫడ్నవీస్(Devendra Fadnavis) సీఎం అవుతారని అంతా అనుకున్నారు. కానీ బీజేపీ హైకమాండ్ ఆయనను డిప్యూటీ సీఎంగా ప్రమోట్ చేసింది.
దీనిపై వివిధ రాజకీయ పార్టీలు స్పందించాయి. రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) తన అధికారిక ట్విట్టర్ లో ఫడ్నవీస్ ను భారత దేశపు మొదటి అగ్ని వీర్ గా పేర్కొంది.
అగ్ని వీర్స్ అనేది కొత్త మిలిటరీ రిక్రూట్ మెంట్ స్కీం. అగ్నిపథ్ స్కీం కింద కొంత కాలం పాటు మాత్రమే ఎంపిక చేస్తారు. ఆ తర్వాత తొలగిస్తారు.
వారికి ఎలాంటి బెనిఫిట్స్ , పెన్షన్ సౌకర్యం ఉండదు. ఇదిలా ఉండగా తిరుగుబాటు ఎమ్మెల్యేలపై అనర్హత వేటుకు సంబంధించిన కేసులో సుప్రీంకోర్టు లో శివసేన తరపున వాదిస్తున్న కాంగ్రెస్ నాయకుడు అభిషేక్ సింఘ్వి సీఎం పదవిని కోల్పోయినందుకు ఫడ్నవీస్ పై కామెంట్ చేశారు.
డిప్యూటీ సీఎం పదవిని బిజేపీ ఎందుకు ఎంచుకుందనేదనే దానికి సమాధానం చెప్పాలన్నారు. భారత రాజకీయాల్లో కొత్త ఎల్ కే అద్వానీగా పేర్కొన్నారు.
ఫడ్నవీస్ ఎప్పటికీ వేచి ఉన్న సీఎంగా మిగిలి పోయారంటూ ఎద్దేవా చేశారు. కాగా సీఎం పదవిని పంచు కోవడంపై వచ్చిన వివాదం 2019లో శివసేన, బీజేపీ విడి పోవడానికి దారి తీసింది.
ఇక మహారాష్ట్ర కాంగ్రెస్ కూడా వ్యంగ్యంగా స్పందించింది. నేను తిరిగి వస్తాను అని ఫడ్నవీస్ పేర్కొన్నారు. దీనిని మరాఠీలో నేను తిరిగి వస్తాను కానీ చూడటానికి మాత్రమేనని ట్వీట్ చేసింది.
Also Read : మేం షిండే సర్కార్ ను కూల్చం – రౌత్