Devendra Fadnavis : వాళ్లను క్షమిస్తా ప్రతీకారం తీర్చుకోను
అసెంబ్లీలో డిప్యూటీ సీఎం ఫడ్నవీస్
Devendra Fadnavis : రాజకీయాల్లో మార్పులు చోటు చేసుకోవడం ఖాయం. తనను టార్గెట్ చేసిన వారి గురించి నేనేమీ పట్టంచుకోను. ఎందుకంటే ఎవరు ఎప్పుడు ఏ పదవి వరిస్తుందో చెప్పలేం. ప్రజాస్వామ్యంలో ఏది ఎప్పుడు ఎలా అదృష్టం వరిస్తోందో ఊహించ లేం.
అందుకే ప్రతి దానిని నేను సానుకూల దృక్పథంతో ఆలోచించేందుకు అలవాటు చేసుకున్నానని సంచలన వ్యాఖ్యలు చేశారు మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా నియమితులైన దేవేంద్ర ఫడ్నవీస్(Devendra Fadnavis).
ఇవాళ కొలువు తీరిన షిండే ప్రభుత్వం బల పరీక్షలో నెగ్గింది. ఈ సందర్భంగా శాసనసభలో ఫడ్నవీస్ ప్రసంగించారు. కొందరు కావాలని నన్ను టార్గెట్ చేశారు. వాళ్ల గురించి ప్రజలందరికీ తెలుసు. కానీ మేం ఎప్పుడూ వాళ్లను వ్యక్తిగతంగా విమర్శించ లేదన్నారు.
రాజకీయాల్లో ప్రత్యర్థుల మాటల వినేందుకు అందరం సిద్దం కావాలని స్పష్టం చేశారు దేవేంద్ర ఫడ్నవీస్(Devendra Fadnavis). కేవలం సోషల్ మీడియా (సామాజిక మాధ్యమాలు ) లో ప్రకటనలు, పోస్ట్ చేసినందుకు వ్యక్తులను జైలలో పెట్టడం చూశామన్నారు.
మనకు వ్యతిరేకంగా మాట్లాడే వ్యక్తులకు మనం సమాధానం చెప్పే స్థితిలో ఉండాలని చెప్పారు డిప్యూటీ సీఎం. విమర్శలకు సరైన రీతిలో స్పందించడం నేర్చుకోవాలన్నారు.
నేను తిరిగి వస్తానని ఒకసారి చెప్పాను. కానీ నేను అలా అనడంతో చాలా మంది (శివసేన) నన్ను ఎగతాళి చేశారు. కానీ నేను అన్నమాట నిలబెట్టుకున్నా ఏక్ నాథ్ షిండేను నా వెంట తీసుకు వచ్చానని చెప్పారు దేవేంద్ర ఫడ్నవీస్.
నన్ను అన్నందుకు ప్రతీకారం తీర్చుకోను వాళ్లను క్షమిస్తానని అన్నారు.
Also Read : షిండే సర్కార్ బన్ గయా షాన్ దార్