Tirumala : కలియుగ దైవం కొలువై ఉన్న తిరుమల పుణ్య క్షేత్రం భక్తుల జన సందోహంతో నిండి పోయింది. గోవిందా గోవిందా ఆపద మొక్కుల వాడా గోవిందా అంటూ భక్తులు స్వామి వారి దర్శనం కోసం నిలిచి ఉన్నారు. వేసవి సెలవులు పూర్తయినా ఇంకా తిరుమలకు భక్తులు తండోప తండాలుగా తరలి వస్తూనే ఉన్నారు. గత ఆదివారం రికార్డు స్థాయిలో శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఏకంగా 92 వేలకు పైగా దర్శించు కోవడం విస్తు పోయేలా చేసింది. ప్రతి రోజూ 70 వేల మందికి పైగా భక్తులు తిరుమలను దర్శించుకుంటున్నారు.
జూన్ 15న శుక్రవారం శ్రీనివాసుడిని, అలివేలు మంగమ్మ అమ్మ వారిని 70 వేల 896 మంది దర్శించుకున్నారు. స్వామి వారికి 37 వేల 546 మంది తల నీలాలు సమర్పించుకున్నారు. ఇక స్వామి వారి హుండీకి భారీ ఎత్తున కానుకులు , విరాళాలు అందాయి. 90 వేలకు పైగా దర్శించుకున్నప్పుడు కూడా ఇంత పెద్ద మొత్తంలో రాలేదు. కానీ నిన్న ఒక్క రోజు మాత్రం కానుకలు, విరాళాల రూపేణా గోవందుడికి ఏకంగా రూ. 4.07 కోట్ల ఆదాయం సమకూరింది.
సర్వ దర్శనం కోసం టోకెన్లు లేకుండా భక్తులు కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు. వీరికి దర్శన సమయం దాదాపు 24 గంటల సమయం పట్టే అవకాశం ఉందని తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) వెల్లడించింది. ఇదిలా ఉండగా సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా టీటీడీ చర్యలు చేపట్టింది.
Also Read : Pawan Kalyan : ఉప్పాడను సిల్క్ సిటీగా మారుస్తాం