Ganga Sagar : ఓ వైపు కరోనా తాండవం చేస్తోంది. ఇప్పటికే ఒక్క రోజులో 2 లక్షల 65 వేలకు పైగా కొత్తగా కేసులు నమోదు అయ్యాయి. మకర సంక్రాంతి పండగ వచ్చిందంటే చాలు పశ్చిమ బెంగాల్ లో గంగా సాగర్(Ganga Sagar )కు భక్తులు భారీగా తరలి వస్తున్నారు.
కరోనా రూల్స్ పాటించాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. గంగా , బంగాళా ఖాతం సంగమం వద్ద లక్షలాది మంది తండోప తండాలుగా తరలి వస్తున్నారు. ఓ వైపు కొత్త వేరియంట్ ఓమిక్రాన్ విజృంభిస్తోంది.
ముందస్తు చేసిన హెచ్చరికలు ఎక్కడా కనిపించడం లేదు. ఈశాన్య రాష్ట్రంలో కోవిడ్ కేసులు పెరుగుతుండడం ఒకింత ఆందోళన కలిగిస్తోంది.
హిందూ తీర్థ యాత్రలో పాల్గొనేందుకు దేశ వ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు దక్షిణ 24 పరగణాల జిల్లాలోని గంగా సాగర్(Ganga Sagar )ఉంది. ఒక్క పశ్చిమ బెంగాల్ రాష్ట్రం నుంచే కాకుండా దేశం నలుమూలల నుంచి గంగా సాగర్ వద్దకు తరలి వస్తారు.
మకర సంక్రాంతి పండుగ సందర్భంగా భక్తులు పవిత్ర సంగమంగా భావించే గంగా సాగర్ లో స్నానం చేస్తే పవిత్ర చేకూరుస్తుందని నమ్మకం. ఇదిలా ఉండగా పశ్చిమ బెంగాల్ లో గత 24 గంటల్లోనే 23 వేలకు పైగా కొత్తగా కరోనా కేసులు నమోదు అయ్యాయి.
అంతకు ముందు రోజు వారీ కేసులతో పోలిస్తే 1,312 కు పెరిగింది. కరోనా రేటు 30.86 శాతం నుంచి 32.13 కి పెరగడం గమనార్హం. అయితే కరోనా కేసుల కట్టడికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ.
Also Read : గత చరిత్రకు దర్పణం బుద్ధవనం