TTD Exhibition : తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దేశంలో అత్యధిక ఆదాయం కలిగిన పుణ్యక్షేత్రంగా భాసిల్లుతోంది తిరుమల.
కొలువై ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామి, అలివేలు మంగమ్మ ను దర్శించుకునేందుకు ప్రతి రోజూ వేలాది మంది భక్త బాంధవులు తరలి వస్తారు. టీటీడీ(TTD Exhibition )ఎన్నో కార్యక్రమాలను చేపడుతోంది.
ప్రతి నిత్యం అన్నాదనం చేస్తూ భక్తుల ఆకలిని తీరుస్తోంది. ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాలలోని ఆలయాల పునరుద్దరణ, పూర్వ వైభవానికి శ్రీకారం చుట్టింది.
గోశాలలు, వేద పాఠశాలలను, ఉచితంగా ఆస్పత్రులను నిర్వహిస్తోంది. అంతే కాకుండా రసాయనాలు లేని వస్తువులను నిత్య కైంకర్యానికి వాడుతోంది.
ఈ తరుణంలో తిరుమలకు ప్రాణ ప్రతిష్ట చేసిన వెయ్యేళ్ల కిందట జన్మించిన శ్రీ రామానుజుడి సహస్రాబ్ది మహోత్సవాలు ముచ్చింతల్ లో జరుగుతున్నాయి.
ఇక్కడ శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చిన్న జీయర్ స్వామి వారి పర్యవేక్షణలో యాగం కొనసాగుతోంది. ఇందులో భాగంగా టీటీడీ(TTD Exhibition )చేపడుతున్న కార్యక్రమాలు ఏమిటనే దానిపై భక్తులకు తెలియ చేసేందుకు గాను ఫోటో ఎగ్జిబిషన్ తో పాటు తయారు చేసిన వస్తువులకు సంబంధించి ప్రదర్శన ఏర్పాటు చేసింది.
దీనికి భక్తులు పెద్ద ఎత్తున హాజరవుతున్నారు. టీటీడీ చేపట్టిన ప్రయత్నాన్ని అభినందిస్తున్నారు. ఇందులో భాగంగా టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి పాల్గొని సంతృప్తిని వ్యక్తం చేశారు. చిన్నజీయర్ స్వామి వారి ఆశీస్సులు అందుకున్నారు.
ఇదిలా ఉండగా శ్రీవారి ఆలయం ప్రాముఖ్యత, సామాజిక, ఆర్థిక కార్యకలాపాలను తెలియ చేసేందుకు దీనిని ఏర్పాటు చేశామన్నారు ఈవో జవహర్ రెడ్డి.
Also Read : డేరా బాబాకు 21 రోజులు రిలీఫ్