DG Tech MD Khan Vilker : స్కాం అబద్దం అరెస్ట్ అన్యాయం
డీజీ టెక్ కంపెనీపై దుష్ప్రచారం తగదు
DG Tech MD Khan Vilker : ఆంధ్రప్రదేశ్ – దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది ఏపీలో చోటు చేసుకున్న ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్కీం స్కామ్ కేసు. ఈ కేసుకు సంబంధించి మాజీ సీఎం, టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడును ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ కు తరలించింది. ప్రధానంగా డీజీ టెక్ కంపెనీతో చేసుకున్న ఒప్పందం మేరకు రూ. 371 కోట్ల స్కామ్ చోటు చేసుకుందని ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది. ఆపై 25 పేజీల రిమాండ్ రిపోర్ట్ తయారు చేసింది.
DG Tech MD Khan Vilker Shocking Comments
షెల్ కంపెనీల ద్వారా ఆ డబ్బులను హవాలా రూపంలో చేతులు మారాయంటూ సంచలన ఆరోపణలు చేసింది. ఈ మేరకు పక్కా ఆధారాలు ఉన్నాయని ఏపీ సీఐడీ చీఫ్ ఎన్. సంజయ్ ప్రకటించారు. ఇదే విషయంపై కోర్టులో వాదోపవాదనలు జరిగాయి. కానీ జడ్జి మాత్రం చంద్రబాబు నాయుడుకు(Chandrababu Naidu) బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించారు.
స్పష్టమైన ఆధారాలు ఉన్నప్పుడు మాజీ సీఎం అని వెసులుబాటు అంటూ ఉండదని స్పష్టం చేశారు జడ్జి బీఎస్వీ హిమ బిందు. ఈ మొత్తం వ్యవహారంలో డీజీ టెక్ కంపెనీపై పెద్ద ఎత్తున ఆరోపణలు, విమర్శలు వెల్లువెత్తాయి.
దీనిపై సదరు కంపెనీ ఎండీ ఖాన్ విల్కర్ స్పందించారు. ఎలాంటి స్కామ్ చోటు చేసుకోలేదన్నారు. ఈ స్కామ్ లో చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేయడం దురదృష్టకరమన్నారు. మొత్తం వ్యవహారాన్ని వివరించారు. కంపెనీ తరపున వీడియో విడుదల చేశారు.
ఒప్పందం మేరకు సామాగ్రిని సరఫరా చేయడం జరిగిందన్నారు ఖాన్ విల్కర్. పరికరాలు నాసిరకంగా ఉన్నా, రిపేరుకు వచ్చినా పూచీ తీసుకున్నామని చెప్పారు. జీఎస్టీ స్కాం ఉందన్న ఆరోపణలు వాస్తవం కాదన్నారు. ఆడిటర్లను పంపిస్తే పూర్తి లెక్కలు చూపుతామని స్పష్టం చేశారు ఎండీ.
Also Read : Natti Kumar : బాబు అరెస్ట్ పై నోరు విప్పండి