DGCA Notice Air India : ఎయిర్ ఇండియాకు డీజీసీఏ నోటీస్
మూత్ర విసర్జన ఘటనపై ఆగ్రహం
DGCA Notice Air India : భారతీయ వ్యాపార దిగ్గజం టాటా సంస్థకు కోలుకోలేని షాక్ తగిలింది. భారత ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఎయిర్ ఇండియాను ఏరికోరి కోట్లు పెట్టి కొనుగోలు చేశారు టాటా సంస్థల చైర్మన్ రతన్ టాటా. మరో వైపు కీలకమైన వ్యక్తిని ఎయిర్ ఇండియా ఎయిర్ లైన్స్ కు సిఇఓను చేశారు.
ఆయనే చంద్రశేఖరన్. ప్రస్తుతం ఎయిర్ ఇండియాలో వరుసగా ఇబ్బందికరమైన ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఢిల్లీ అమెరికా ఎయిర్ ఇండియా విమానంలో ఓ ప్రయాణికుడు తాగి ఇంకొకరిపై మూత్రం పోసిన ఘటన సంచలనం రేపింది. దేశ వ్యాప్తంగా చర్చకు దారితీసింది.
ఇందుకు సంబంధించి మూత్ర విసర్జన కేసులో ఎయిర్ ఇండియాపై డీజీసీఏ (DGCA Notice Air India) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు సదరు సంస్థకు నోటీసులు జారీ చేసింది. అన్ని ఎయిర్ లైన్స్ సంస్థలన్నీ డీజీసీఏ పరిధిలో ఉంటాయి. ఇది భారత ప్రభుత్వ ఆధీనంలో నడుస్తుంది. ఎప్పటికప్పుడు మార్గదర్శకాలు, రూల్స్ జారీ చేస్తుంది.
ప్రయాణికుల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వారికి కావాల్సిన సదుపాయాలు, ఎయిర్ పోర్ట్ లలో సౌకర్యాలు, తదితర వాటినన్నింటిని డీజీసీఏ పర్యవేక్షిస్తుంది. ఈ తరుణంలో ఎయిర్ ఇండియా ఫ్లైట్ లో మూత్ర విసర్జన ఘటన చేసుకున్న రెండు రోజుల తర్వాత మరో ఘటన చోటు చేసుకోవడం కలకలం రేపింది.
దీనిపై సీరియస్ గా స్పందించింది డీజీసీఏ. సదరు ప్రయాణికుడు ఎక్కడా ప్రయాణం చేయకుండా 30 రోజుల పాటు నిషేధం విధించింది ఎయిర్ ఇండియా. నోటీసుకు ఏం సమాధానం చెబుతుందో చూడాలి.
Also Read : ఇండిగో సిఇఓ షాకింగ్ కామెంట్స్