Dharmana Prasada Rao : విశాఖ కోసం ధిక్కార స్వరం
మంత్రి ధర్మాన ప్రసాదరావు షాకింగ్ కామెంట్స్
Dharmana Prasada Rao : ఏపీలో రాజధానుల నినాదం ఊపందుకుంది. ఇంకా ఎన్నికలు జరిగేందుకు సమయం ఉన్నప్పటికీ రాజకీయాలు మరింత వేడిని రాజేస్తున్నాయి. ఇప్పటి దాకా అంతా తానై వ్యవహరిస్తూ వస్తున్న ఏపీ సీఎం సందింటి జగన్ మోహన్ రెడ్డికి ఈ క్యాపిటల్స్ వ్యవహారం తలనొప్పిగా మారింది.
తెలుగుదేశం పార్టీ హయాంలో ఏపీకి అమరావతి ప్రాంతంగా రాజధానిగా డిక్లేర్ చేసింది. దీంతో పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ వ్యాపారం సాగింది. దీనిపై మాటల యుద్దం కొనసాగుతూ వచ్చింది. ఈ తరుణంలో వైసీపీ కొలువు తీరాక జగన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఏపీని మూడు ముక్కలుగా చేశారు.
ఇందులో భాగంగా మూడు క్యాపిటల్ సిటీస్ గా చేస్తామని వెల్లడించారు. దీనిపై హర్షం కూడా వ్యక్తమైంది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పలువురు కోర్టును ఆశ్రయించారు. అమరావతి, విశాఖ, కర్నూలు ప్రాంతాలను రాజధానులుగా చేస్తామన్నారు. రాష్ట్రంలో ఈ రాజధానుల గొడవ ముదిరింది. ప్రతిపక్షాలు ఓ వైపు సీఎంను టార్గెట్ చేస్తుండగా వైసీపీలో కూడా స్వంత పార్టీ నేతలే స్వరం పెంచారు.
తాజాగా కేబినెట్ లో కీలక మంత్రి పదవి నిర్వహిస్తున్న ధర్మాన ప్రసాదరావు(Dharmana Prasada Rao) షాకింగ్ కామెంట్స్ చేశారు. కుదిరితే విశాఖపట్టణాన్ని రాజధానిగా చేయాలని లేక పోతే ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
తాజాగా ఆయన చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం బొంతలకోడూరులో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ధర్మాన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.
Also Read : లిక్కర్ అమ్మకాల్లో తెలంగాణ టాప్