Dharmapuri Arvind : కేసీఆర్ చెప్పినట్లే రేవంత్ కామెంట్స్
నిప్పులు చెరిగిన ఎంపీ ధర్మపురి అర్వింద్
Dharmapuri Arvind : నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ నిప్పులు చెరిగారు. ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ రెండూ ఒక్కటేనని ఆరోపించారు. ఆయా మీడియా సంస్థలకు సీఎం డబ్బులు ఇచ్చి ప్రచారం చేయమని ఆదేశించారంటూ మండిపడ్డారు. బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీకి కేసీఆర్ మద్దతు ఇస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎంపీ ధర్మపురి అరవింద్.
కేసీఆర్ అనుకున్న దానికంటే ఎక్కువ హైప్ వచ్చింది కాంగ్రెస్ పార్టీకి. దీంతో మళ్లీ డ్యామేజ్ చేయాలని కేవలం రైతులకు 3 గంటల పాటే కరెంట్ ఇవ్వాలని రేవంత్ రెడ్డి కామెంట్స్ చేశాడంటూ ధ్వజమెత్తారు. ఉచిత విద్యుత్ అవసరం లేదని చెప్పమని చెప్పాడని ఆరోపించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ ఆందోళనలు, నిరసనలు చేపట్టిందని ఫైర్ అయ్యారు ఎంపీ ధర్మపురం అరవింద్.
సీఎం కేసీఆర్ వ్యూహంలో భాగంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆడుతున్నాడని , కాంగ్రెస్ పార్టీ, భారత రాష్ట్ర సమితి పార్టీలు రెండూ ఒక్కటేనని ఆరోపించారు. ఇదిలా ఉండగా బీజేపీ ఎంపీ(Dharmapuri Arvind) చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి.
ఇదిలా ఉండగా ధర్మపురం అరవింద్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు బీఆర్ఎస్ నేతలు. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం మంచి పద్దతి కాదని హితవు పలికారు. గతంలో కూడా ఇలాంటి చౌకబారు కామెంట్స్ చేస్తూ వచ్చారని మండిపడ్డారు. ప్రజలు బుద్ది చెప్పడం ఖాయమన్నారు.
Also Read : MK Stalin Modi : కేంద్రంపై భగ్గుమన్న స్టాలిన్