DK Shiva Kumar : ధృవ్ నారాయన్ మృతి పార్టీకి తీరని లోటు
కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్ కంట తడి
DK Shiva Kumar Condolence : కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ ధృవ్ నారాయణ్ శనివారం కన్ను మూశారు. ఆయన మృతితో కర్ణాటక కాంగ్రెస్ లో తీవ్ర విషాదం అలుముకుంది. ఈ సందర్బంగా కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్(DK Shiva Kumar Condolence) స్పందించారు. ఆయన కంటతడి పెట్టారు. ఆయన లేరన్న వార్తను జీర్ణించుకోలేక పోతున్నానని వాపోయారు. ఒక రకంగా అపారమైన నష్టం మిగిలిందన్నారు. ఒక వారియర్ కంటే ఎక్కువగా పార్టీ కోసం పని చేశాడంటూ కితాబు ఇచ్చారు. కన్నీరు మున్నీరయ్యారు . నాకు కుడి భుజంగా ఉంటూ వచ్చారని ధృవ్ నారాయణ్ గురించి ప్రస్తావించారు.
రాష్ట్రంలో పార్టీ బలోపేతంలో కీలక పాత్ర పోషించారు. నిద్ర పోతున్న సమయంలో ఫోన్ వచ్చింది. ఈ వార్తను వినలేక పోయానని వాపోయారు డీకే శివకుమార్. కాంగ్రెస్ కుటుంబానికి బాధ్యత వహించే సమర్థుడైన వ్యక్తిని కోల్పోవడం బాధాకరమన్నారు కేపీసీసీ చీఫ్. ధృవ్ నారాయణ్ ఎవరినీ నొప్పించే వ్యక్తి కాదు. ఆయన అంటే అన్ని పార్టీల నాయకులు ఆసక్తిని కనబర్చే వారంటూ గుర్తు చేసుకున్నారు . సమాజంలోని ప్రజలందరి అభిమానం పొందిన గొప్ప నాయకుడంటూ కొనియాడారు డీకే శివకుమార్(DK Shiva Kumar).
నా కుటుంబానికి , రాష్ట్ర కార్మికులందరికీ తరగని ఆస్తిగా ఉన్నారు . ధృవ్ నారాయణ్ చేసిన కృషి గురించి ఎంత చెప్పినా తక్కువేనని పేర్కొన్నారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే. మాజీ చీఫ్ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఫోన్ చేసి సంతాపం వ్యక్తం చేశారు. కరోనా కష్ట కాలంలో సైతం కేపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ విస్తృతంగా పనిచేశారు. ప్రజాదరణ పొందారు.
Also Read : కాంగ్రెస్ సీనియర్ నేత కన్నుమూత