Farah Khan : ఎవరీ ఫరా ఖాన్ అనుకుంటున్నారా. పాకిస్తాన్ దేశ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ భార్య స్నేహితురాలే ఫరా ఖాన్(Farah Khan). దేశ ప్రధానిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టిన అనంతరం 90 వేల డాలర్లు కలిగిన బ్యాగ్ తో దేశం దాటి వెళ్లి పోయిందంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
ఈ విమర్శలు చేసింది ఎవరో కాదు పాకిస్తాన్ కు చెందిన ప్రతిపక్షాలు. ప్రధానిగా ఉన్న సమయంలో ఆమె రాజ్యాంగతేర శక్తిగా వ్యవహరించిందంటూ ఆరోపించారు.
ఇష్టానుసారంగా అధికారులను బదిలీ చేశారు. ఇందులో లక్షలాది డబ్బులు చేతులు మారాయని పేర్కొన్నారు. ఇందులో భాగంగానే ఆమె ఆ డబ్బులతో పారి పోయిందంటూ మండిపడ్డాయి విపక్షాలు. ప్రస్తుతం ఆమె బ్యాగ్ తో విమానంలో బయలు దేరుతున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇమ్రాన్ ఖాన్ మూడో భార్య బుష్రా బీబీకి ఫరా ఖాన్ క్లోజ్ ఫ్రెండ్. విలాసవంతమైన హ్యాండ్ బ్యాగ్ తో ప్రయాణం చేసిందని పేర్కొన్నారు. దేశంలో నెలకొన్న రాజకీయ గందరగోళం మధ్య అవినీతి, ఆరోపణలు రావడంతో ఫరా ఖాన్ దుబాయ్ వెళ్లి పోయారు.
ట్విట్టర్ లో ఈ ఫోటో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆ బ్యాగ్ విలువ 90 వేల డాలర్లు అని ప్రతిపక్షాల నాయకులు విమర్శిస్తున్నారు. పరారైన బుష్రా ఫ్రంట్ వుమెన్ ఫరా ఖాన్(Farah Khan) వద్ద ఉన్న బ్యాగ్ వాల్యూ లెక్కించడం కష్టమని పేర్కొన్నారు పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ నేత రోమినా ఖుర్షీద్ ఆలం.
దుబాయికి ప్రైవేట్ విమానంలో ప్రయాణించాలంఏట 50 వేల డాలర్లు ఖర్చవుతుంది. ఫరా ఖాన్ పాకిస్తాన్ లో అక్రమాలకు కేరాఫ్ గా నిలిచారని ఆరోపించారు మరియం నవాజ్.
Also Read : మూడు నెలల్లో ఎన్నికలు అసాధ్యం