#StudyAbroad : డిఫరెంట్ కోర్సులు చేస్తే అమెరికా లో జాబ్ ఈజీ
ఇంజనీరింగ్ కంటే ప్రత్యామ్నాయ కోర్సులే బెటర్
Study Abroad : భారతీయ స్టూడెంట్లకు అమెరికా అంటే పిచ్చి. ఓ ఫ్యాషన్. ప్రతి ఒక్కరి కల అక్కడికి వెళ్లాలని. డాలర్లు సంపాదించాలని. కోట్లు వెనకేసు కోవాలని. కొందరే అక్కడ సక్సెస్ అయ్యారు. ఇండియాలో ఉన్నట్లే అక్కడా నిరుద్యోగం ఉంది. నిన్నటి దాకా ప్రెసిడెంట్ గా ఉన్న ట్రంప్ టాప్ ప్రయారిటీ అమెరికన్లే. వాళ్లు లేక పోతే నేను లేను అన్నాడు. తర్వాత మాట వెనక్కి తీసుకున్నాడు. ఇక్కడ మనకు ఉన్నంత స్వేచ్ఛ అక్కడ ఉండదు. అపరిమితమైన స్వేచ్ఛ ఉన్నా కఠిన మైన చట్టాలు ఉన్నాయి. అక్కడి స్టడీ, యూనివర్శిటీల్లో సదుపాయాలు, పరిశోధనలు చేసేందుకు లభిస్తున్న ఉపకార వేతనాలు ఇక్కడి పిల్లలను అమెరికా వెళ్లేలా చేస్తున్నాయి.
మనోళ్ల దృష్టి అంతా ఇంజనీరింగ్ కోర్సుల పైనే ఉంటోంది. తాజాగా ఐటీ కొత్త పుంతలు తొక్కుతోంది. వాటికి ప్రత్యామ్నాయంగా ఇతర రంగాలకు చెందిన కోర్సులకు డిమాండ్ ఉంటోంది అమెరికాలో. సైన్సు, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ , బిజినెస్ కోర్సులే కాకుండా సంప్రదాయేతర కోర్సులను ఎంపిక చేసుకుంటున్నారు. అక్కడి యూనివర్శిటీల్లో చేరితే జాబ్ కు ఢోకా ఉండక పోవడంతో ఇపుడు వీటిపై పడ్డారు. టాప్ ప్రయారిటీ ఇస్తున్న కోర్సుల్లో మెరైన్ ఇంజనీరింగ్, జియో ఫిజిక్స్ , గేమింగ్ డిజైన్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, సైకాలజీ కోర్సుల పట్ల మక్కువ చూపుతున్నారు.
శాట్ తో పాటు టోఫెల్, ఐఈఎల్‌టీఎస్, జీఆర్‌ఈ వంటి పరీక్షల్లో ప్రతిభ కనబర్చాల్సి ఉంటుంది. లేక పోతే అమెరికాకు వెళ్లలేరు. అక్కడి యూనివర్శిటీలు వీటి స్కోర్ ఆధారంగానే విద్యార్థులకు కోర్సులలో అడ్మిషన్లు కల్పిస్తాయి. ఏ మాత్రం పొరపాటు చేసినట్లయితే అక్కడే ఇరుక్కు పోతారు. అక్కడికి వెళ్లే ముందు అమెరికా కల్చర్, నియమ నిబంధనలు, ఆ దేశ వ్యవహారాలు, ప్రభుత్వ నిర్ణయాలు, పోకడపై కాస్తంత తెలివి కలిగి ఉండాలి. లేకపోతే బాడీ మాత్రమే ఇక్కడికి వస్తుందన్నది గమనించాలి.
No comment allowed please