Digvijay Singh : ట్రబుల్ షూటర్ గా పేరొందారు దిగ్విజయ్ సింగ్(Digvijay Singh) కాంగ్రెస్ పార్టీలో. ఆయన ఏది మాట్లాడినా ఓ సంచలనమే. తాజాగా భారతీయ ఎన్నికల వ్యూహకర్తగా పేరొందిన ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతారన్న ప్రచారం జోరందుకుంది.
ఈ తరుణంలో డిగ్గీ రాజా చేసిన కామెంట్స్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. 137 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన పార్టీగా పేరుంది కాంగ్రెస్ కు. సీనియర్లు, అపర మేధావులు, తలపండిన రాజకీయ నాయకులు ఎక్కువగా ఉన్నారు.
పూర్తి దూకుడు ప్రదర్శించే ప్రశాంత్ కిషోర్ ను ఆహ్వానిస్తే ఎలా రియాక్షన్ ఉంటుందనే దానిపై ఇంకా కొలిక్కి రాలేదు. అయితే ఇప్పటి దాకా నాలుగు సార్లు పీకే ఏఐసీసీ తాత్కాలిక చీఫ్ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా ఆయన పార్టీకి సంబంధించి బ్లూ ప్రింట్ కూడా అందజేశారు. ఇందులో రాబోయే 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ అనుసరించాల్సిన వ్యూహాలు, తీసుకోవాల్సిన చర్యలు, రోడ్ మ్యాప్ సిద్దం చేసినట్లు సమాచారం.
పార్టీ సమాచారం ప్రకారం 600 స్లైడ్స్ కూడా సబ్మిట్ చేసినట్లు టాక్. పీకేతో సంప్రదింపులు జరుపుతున్న వారిలో మేడం సోనియా గాంధీతో దిగ్విజయ్ సింగ్(Digvijay Singh) కూడా ఉన్నారు.
ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. పీకే విషయంలో ఎలాంటి అనుమానం లేదు. మనకు తెలియనిది ఏమీ లేదు. పార్టీలో చేర్చుకునేందుకు ఎలాంటి ప్రతిఘటన అంటూ ఉండదు.
పీకే విషయంలో ఫైనల్ డెసిషన్ తీసుకోవాల్సింది తాము కాదని మేడం సోనియా గాంధీనేనని స్పష్టం చేశారు డిగ్గీ రాజా.
Also Read : తగ్గని పేదరికం తప్పని ద్రవ్యోల్బణం