Digvijaya Singh : మార్పు ఖాయం హస్తందే అధికారం
కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్
Digvijaya Singh : హైదరాబాద్ – కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్(Digvijaya Singh) సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, ఇది ప్రతి చోటా కనిపిస్తోందని అన్నారు. అధికారంలో 10 ఏళ్ల పాటు కొలువు తీరిన బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల కోసం చేసింది ఏమీ లేదన్నారు. కేవలం సంక్షేమ పథకాల పేరుతో జనాన్ని బురిడీ కొట్టించే ప్రయత్నం చేశారు తప్పా సామాన్యులకు ఒరిగింది ఏమీ లేదన్నారు. పదే పదే కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు తమ పార్టీ గురించి విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు.
Digvijaya Singh Comment
ఆనాడు గనుక సోనియా గాంధీ ఒప్పుకోక పోతే ఇవాళ తెలంగాణ వచ్చి ఉండేది కాదన్నారు. కేసీఆర్ ఫ్యామిలీ వచ్చి కలిసి ఫోటోలు దిగడం మరిచి పోయారా అని నిలదీశారు. కేవలం తెలంగాణను ఒక్క దానినే అడ్డం పెట్టుకున్ని అన్ని వ్యవస్థలను సర్వ నాశనం చేశారని ఆరోపించారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, ఇక భరించ లేని స్థితికి వచ్చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
పైకి బీజేపీ, ఎంఐఎం, బీఆర్ఎస్ ఆరోపణలు చేసుకుంటున్నాయని కానీ జనానికి మొత్తం తెలుసు ఈ మూడు పార్టీలు ఒక్కటేనని అన్నారు. ఇంకెంత కాలం ప్రజలను మోసం చేయాలని చూస్తారంటూ నిప్పులు చెరిగారు దిగ్విజయ్ సింగ్. ఇకనైనా సొల్లు కబుర్లు చెప్పడం మానుకోవాలని హితవు పలికారు సీఎం కేసీఆర్ కు .
Also Read : DK Shiva Kumar : మోడీ..కేసీఆర్ ఇద్దరూ ఒక్కటే