Dilip Ghosh : సౌగతా రాయ్ ని కొట్టే రోజు వస్తుంది
బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు దిలీప్ ఘోష్
Dilip Ghosh : భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు దిలీప్ ఘోష్(Dilip Ghosh) సంచలన కామెంట్స్ చేశారు. టీఎంసీకి చెందిన సౌగతా రాయ్ ను ప్రజలు బూట్లతో కొట్టే రోజు తప్పకుండా వస్తుందన్నారు.
ఆయనను కొట్టే రోజు ఎంతో దూరంలో లేదన్నారు. అయితే పశ్చిమ బెంగాల్ లో రోజు రోజుకు టీఎంసీ నేతల ఆగడాలు మితి మీరి పోతున్నాయని ఆరోపించారు.
ఇప్పటికే ఈడీ చుక్కలు చూపించిందని, దెబ్బకు మంత్రి జైలు పాలయ్యారని మండిపడ్డారు. చాలా చోట్ల విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారంటూ ఆరోపించారు.
త్వరలోనే టీఎంసీ నేతలను ప్రజలు తన్ని తరిమి కొట్టే రోజు తప్పక వస్తుందన్నారు. అది జరగడం ఖాయమన్నారు దిలీప్ ఘోష్. తనపై టీఎంసీ నేత సౌగతా రాయ్ చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు ఘోష్.
టీఎంసీకి చెందిన ఇద్దరు నేతలను వేర్వేరు కేసుల్లో అరెస్ట్ చేశాక ప్రతిపక్ష పార్టీలు టీఎంసీని టార్గెట్ చేశాయి. తాము నమ్మిన వారి చర్మం ఒలిచి బూట్లు తయారు చేస్తారంటూ వ్యాఖ్యానించారు సౌగతా రాయ్.
పార్టీని కించ పర్చడం ద్వారా తప్పించు కోవచ్చంటూ మరో కామెంట్ చేశారు. అనంతరం అలాంటి కామెంట్స్ చేసి ఉండాల్సి కాదంటూ వివరణ ఇచ్చుకున్నారు.
దీనిపై సీరియస్ గా స్పందించారు దిలీప్ ఘోష్. సౌగతా రాయ్ తలపండిన రాజకీయ నాయకుడు. ఒకప్పుడు ప్రొఫెసర్. కానీ ఆయన విపక్షాలపై వాడుతున్న భాష దారుణంగా ఉందన్నారు దిలీప్ ఘోష్(Dilip Ghosh).
ఇదిలా ఉండగా పార్థ ఛటర్జీని టీచర్ల స్కాంలో , పశువుల స్మగ్లింగ్ లో మోండల్ ను ఈడీ అదుపులోకి తీసుకుంది.
Also Read : ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్దం – ముంతాజ్