Dipankar Slams : సంక్షోభంలో రాజ్యాంగం – దీపాంకర్
ఆవేదన వ్యక్తం చేసిన సీపీఎం నేత
Dipankar Slams : భారతీయ జనతా పార్టీ దేశాన్ని సర్వ నాశనం చేసేందుకు ప్రయత్నం చేస్తోందని సంచలన ఆరోపణలు చేశారు సీపీఎం అగ్ర నేత దీపాంకర్ . మంగళవారం ఆయన బెంగళూరులో మీడియాతో మాట్లాడారు. విపక్షాల కీలక సమావేశం ప్రస్తుతం జరుగుతోంది. ఇందులో పాల్గొన్న అనంతరం దీపాంకర్(Dipankar) సంచలన వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది. ఇవాళ రాజ్యాంగం అవసరం లేదనే స్థాయికి వచ్చారంటూ మండిపడ్డారు.
Dipankar Slams BJP
దేశంలో మోదీ, బీజేపీ సర్కార్ కొలువు తీరాక వ్యవస్థలన్నీ పని చేయకుండా ఉండి పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు దీపాంకర్. ఇవాళ ద్రవ్యోల్బణం, నిరుద్యోగం పెచ్చరిల్లి పోయిందని మండిపడ్డారు. దేశంలో లా అండ్ ఆర్డర్ లేనే లేదన్నారు. ప్రధానంగా ఒకే దేశం, ఒకే జాతి, ఒకే ఓటు అంటూ కొత్త రాగంతో బీజేపీ ముందుకు వస్తోందన్నారు.
కానీ ప్రజలు మేల్కోక పోతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని హెచ్చరించారు దీపాంకర్. పేద, బడుగు, బలహీన , మైనార్టీ వర్గాలకు రాజ్యాధికారంలో చోటు లేకుండా చేయాలనే ఉద్దేశంతోనే ఇలాంటి చవక బారు ప్రకటనలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. ప్రతిపక్షాలు ఏకతాటిపైకి రాక పోతే చాలా ఇబ్బందులు ఏర్పడుతాయని హెచ్చరించారు దీపాంకర్.
Also Read : ER Eswaran : మోదీ చేతిలో దేశం బందీ – ఈశ్వరన్