Eknath Shinde : గవర్నర్ కామెంట్స్ తో ఏకీభవించం – షిండే
మరాఠా సీఎం సంచలన కామెంట్స్
Eknath Shinde : మరాఠాలో కాకా రేపుతున్నాయి గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ. గుజరాతీలు, రాజస్థానీలు ఖాళీ చేస్తే ముంబైలో ఏమీ మిగలదని దేశ ఆర్థిక రాజధానిగా ముంబై ఉండదన్నారు.
ఈ వివాదాస్పద వ్యాఖ్యలపై మహారాష్ట్రలో కలకలం రేగుతోంది. బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు మరాఠా కాంగ్రెస్ పార్టీ చీఫ్ పటోలే.
తన పరిమితికి మించి వ్యాఖ్యలు చేయడం ఆయన సంస్కారాన్ని సూచిస్తోందన్నారు శివసేన పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, ఎంపీ సంజయ్ రౌత్.
మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రే ఏకంగా గవర్నర్ ను ఇంటికి పంపిస్తారా లేక చర్య తీసుకుంటారా అని కేంద్రాన్ని ప్రశ్నించారు. ఇదిలా ఉండగా భగత్ సింగ్ కోష్యార్ చేసిన వ్యాఖ్యలపై మరాఠా వాసులు నిప్పులు చెరుగుతున్నారు.
ఇంత జరుగుతున్నా సీఎంగా కొలువు తీరిన, మాస్ లీడర్ గా పేరొందిన సీఎం ఏక్ నాథ్ షిండే ఎందుకు స్పందించడం లేదంటూ జనం ప్రశ్నించడంతో దిగి వచ్చారు.
గవర్నర్ చేసిన కామెంట్స్ వ్యక్తిగతమని , తాము ఆయన మాటలతో ఏకీభవించే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు సీఎం. కోశ్యారీ రాజ్యాంగ బద్దమైన పదవిలో ఉన్నారు.
ఇతరులను అవమాన పరిచేలా మాట్లాడ కూడదన్నారు ఏక్ నాథ్ షిండే(Eknath Shinde). ముంబై వాసులను తాము ఎప్పుడూ మరిచి పోమన్నారు. ఈ ప్రాంతం అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారని ప్రశంసించారు.
దేశం నలుమూలల నుంచి ఇక్కడే కొలువు తీరారు. వారంతా స్వంత స్థలంగా భావిస్తారని తెలిపారు. ప్రస్తుతం గవర్నర్ దెబ్బకు మరాఠా మండుతోంది.
Also Read : గవర్నర్ లక్ష్మణ రేఖ దాటితే ఎలా