Bhupesh Baghel : ఫ్లైట్ నుంచి దింపడం చిల్లర చర్య – సీఎం
కేంద్ర సర్కార్ పై నిప్పులు చెరిగిన భూపేష్
Bhupesh Baghel Pawan Khera : చత్తీస్ గఢ్ సీఎం భూపేష్ బఘేల్(Bhupesh Baghel) నిప్పులు చెరిగారు. ఆయన కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గురువారం ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి.
కాంగ్రెస్ పార్టీకి చెందిన అధికార ప్రతినిధి, సీనియర్ నాయకుడు పవన్ ఖేరాను ఫ్లైట్ నుంచి దింపారు. ఆపై ఆయనను వెళ్లకుండా అడ్డుకున్నారు. రాష్ట్ర రాజధాని రాయ్ పూర్ లో కీలకమైన ప్లీనరీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సందర్బంగా పాల్గొనేందుకు వచ్చిన పవన్ ఖేరాను అడ్డుకోవడం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది.
ఆయన ఇటీవల ప్రధాన మంత్రి మోదీని, ఆయన తండ్రిని ఏకి పారేశారు. అవమానకరమైన రీతిలో మాట్లాడారంటూ భారతీయ జనతా పార్టీ ఆరోపించింది. ఆయనపై అస్సాంలో కేసు నమోదైంది. ఈ సందర్బంగా అస్సాం పోలీసులు ఆయనను అరెస్ట్ చేసేందుకు యత్నించారనే ఆరోపణలున్నాయి.
ఇదే సమయంలో ఇండియన్ ఎయిర్ లైన్స్ పవన్ ఖేరాను అడ్డుకునే ప్రయత్నం చేసిందని, తన స్వేచ్ఛను హరించారంటూ , రూల్స్ కు విరుద్దంగా ప్రవర్తించారంటూ సంచలన ఆరోపణలు చేశారు పవన్ ఖేరా.
ఈ మొత్తం వ్యవహారంపై సీరియస్ గా రియాక్ట్ అయ్యారు సీఎం భూపేష్ బఘేల్(Bhupesh Baghel Pawan Khera). విమానంలోంచి దింపడం చిల్లర చర్యగా అభివర్ణించారు. సీఎం మీడియాతో మాట్లాడారు. ఇది పూర్తిగా చట్ట విరుద్దమని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం తప్ప మరొకటి కాదన్నారు. ఇదే సమయంలో కేంద్ర దర్యాప్తు సంస్థలతో దాడులు చేయించడం అనేది పనిగా పెట్టుకుందని మండిపడ్డారు సీఎం భూపేష్ బఘేల్. కాంగ్రెస్ విజయంతో భయపడి పోయిందన్నారు.
Also Read : నా స్వేచ్ఛను హరించారు – ఖేరా