DJ Tillu Movie : బాక్సులు బ‌ద్ద‌లు కొడుతున్న’ డీజే టిల్లు’

సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ‌కు ఊహించ‌ని స‌క్సెస్

DJ Tillu Movie : సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ గ‌తంలో ఎన్నో సినిమాలలో న‌టించిన‌ప్ప‌టికీ ఇటీవ‌ల విడుద‌లైన సినిమా డీజే టిల్లుతో మోస్ట్ పాపుల‌ర్ హీరోగా మారి పోయాడు.

ప‌ర్ ఫెక్ట్ టైమింగ్, మాట‌ల‌తో మంట‌లు రేపే క‌నెక్టివిటీ ఉండ‌డం, లైఫ్ పై ప‌ట్టుండ‌డం, ఎక్కువ‌గా చ‌ద‌వ‌డం, రాయ‌డంతో మ‌నోడు స‌క్సెస్ అయ్యాడు.

కాస‌ర్ల శ్యాం రాయ‌గా రామ్ మిర్యాల పాడిన డీజే టిల్లు (DJ Tillu Movie) సాంగ్ దుమ్ము రేపుతోంది. ఓ ర‌కంగా జాతి ర‌త్నాలు ఎలా స‌క్సెస్ సాధించిందో ఈ మూవీ కూడా అద్భుతమైన విజ‌యం స్వంతం చేసుకుంద‌ని సినీ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి.

ఇక సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ గురించి ఎంత చెప్పినా త‌క్కువే. మొద‌ట్లో క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా ప‌ని చేశాడు. గుంటూరు టాకీస్ క‌థ రాసి అందులో న‌టించి విజ‌యాన్ని అందుకున్నాడు. అయినా పేరు రాలేదు.

క‌రోనా కార‌ణంగా లాక్ డౌన్ స‌మ‌యంలో కృష్ణ అండ్ ఇజ్ లీల చిత్రంతో ఓటీటీ ద్వారా ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌ర‌య్యాడు. డిఫ‌రెంట్ మేనరిజం, డైలాగ్ డెలివ‌రీతో పాపుల‌ర్ గా మారాడు సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ‌.

ఊహించ‌ని రీతిలో అటు ఓవ‌ర్సీస్ లో ఇటు రెండు తెలుగు రాష్ట్రాల‌లో భారీ విజ‌యాన్ని న‌మోదు చేసింది డీజే టిల్లు(DJ Tillu Movie). వైజాగ్ కు చెందిన విమ‌ల్ కృష్ణ ఈ మూవీకి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

సితార ప‌తాకంపై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ నిర్మంచాడు. ఈనెల 12న విడుద‌లై బాక్సులు బ‌ద్ద‌లు కొడుతోంది. ఈ ఏడాదిలో విడుద‌లైన ఈ మూవీ భారీ క‌లెక్ష‌న్లు సాధించే దిశ‌గా సాగుతోంది.

రూ. 70 ల‌క్ష‌ల టార్గెట్ తో బ‌రిలోకి దిగిన ఈ చిత్రం ఇప్ప‌టికే రూ. 4 కోట్లకు ద‌గ్గ‌ర‌గా ఉన్న‌ట్లు స‌మాచారం.

Also Read : హిజాబ్ వివాదం జైరా వాసిమ్ ఆగ్ర‌హం

Leave A Reply

Your Email Id will not be published!