DK Aruna : ఎమ్మెల్యేల ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ బ‌క్వాస్

నిప్పులు చెరిగిన భార‌తీయ జ‌న‌తా పార్టీ

DK Aruna : హైద‌రాబాద్ లోని మోయినాబాద్ ఫాం హౌజ్ లో న‌లుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్య‌వ‌హారం క‌ల‌క‌లం రేపుతోంది. ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ ఫెయిల్ అయ్యింది. ఇందులో న‌లుగురు పాల్గొన్నార‌ని , ఎమ్మెల్యేలు ఇచ్చిన స‌మాచారంతో తాము రంగంలోకి దిగిన‌ట్లు వెల్ల‌డించారు సైబ‌రాబాద్ క‌మిష‌న‌ర్ స్టీఫెన్ ర‌వీంద్ర‌.

దీనిపై సీరియ‌స్ గా స్పందించి భార‌తీయ జ‌న‌తా పార్టీ. ఇదంతా సీఎం కేసీఆర్ ఆడించిన నాట‌కం త‌ప్ప ఇంకొక‌టి కాద‌న్నారు. ఈ విష‌యంపై యాద‌గిరిగుట్ట ల‌క్ష్మీ న‌ర‌సింహ్మ స్వామి మీద ప్ర‌మాణం చేసి చెప్పాల‌ని డిమాండ్ చేశారు. స్టీఫెన్ ర‌వీంద్ర తో పాటు పోలీసుల్లో మచ్చుకైన ఆనందం ఏమైనా క‌నిపించిందా అని బీజేపీ సీనియ‌ర్ నాయ‌కురాలు డీకే అరుణ రెడ్డి(DK Aruna) ప్ర‌శ్నించారు.

ఫామ్ హౌజ్ లో జ‌రిగిందంతా ఓ డ్రామా అని కొట్టి పారేశారు. చిల్లర రాజ‌కీయాలు చేయ‌డంలో కేసీఆర్ ఆరితేరారంటూ ఎద్దేవా చేశారు. మునుగోడు లో ఓట‌మి భ‌యంతోనే ఇలాంటి కుట్ర‌ల‌కు తెర లేపారంటూ ధ్వ‌జ‌మెత్తారు డీకే అరుణ‌. ఓ సినిమా స్టోరీని త‌ల‌పింప చేసేలా ఉంద‌న్నారు.

విచిత్రం ఏమిటంటే టీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యేల‌కు చెందిన ఫామ్ హౌస్ లో ఎలా ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ జ‌రుగుతుంద‌ని ప్ర‌శ్నించారు డీకే అరుణ‌. ఈ మొత్తం కావాల‌నే టీఆర్ఎస్ ఆడిన నాట‌క‌మ‌న్నారు. ఆ

ఉన్న న‌లుగురు ఎమ్మెల్యేలు గువ్వ‌ల బాల‌రాజు, బీరం హ‌ర్ష‌వ‌ర్ద‌న్ రెడ్డి, డేగా కాంతా రావు, రోహిత్ రెడ్డి లను రూ. 100 కోట్ల‌కు ఎవ‌రైనా కొనుగోలు చేస్తారా అని నిల‌దీశారు. వీళ్ల‌లో ఎవ‌రైనా మ‌రోసారి గెలుస్తారా అని అన్నారు డీకే అరుణ‌.

Also Read : ఎమ్మెల్యేల ఆప‌రేష‌ష‌న్ ఆక‌ర్ష్ గుట్టు ర‌ట్టు

Leave A Reply

Your Email Id will not be published!