DK Shiva Kumar : కాంగ్రెస్ ప్రభుత్వ అస్థిరతకు కుట్ర – డీకే
సమాచారం ఉందన్న డిప్యూటీ సీఎం
DK Shiva Kumar : కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన బెంగళూరులో మీడియాతో మాట్లాడారు. తమ ప్రభుత్వాన్ని బద్నాం చేసి, అస్థిర పరిచేందుకు కొందరు కుట్ర పన్నుతున్నారంటూ మండిపడ్డారు. కానీ వారి ఆటలు తమ వద్ద సాగవన్నారు డీకే.
DK Shiva Kumar Said
ఎవరు ఏమిటో, ఎవరు పార్టీ కోసం పని చేస్తున్నారో, వ్యతిరేకంగా ప్లాన్ చేస్తున్నారో తన వద్ద పూర్తి సమాచారం ఉందని స్పష్టం చేశారు డిప్యూటీ సీఎం(DK Shiva Kumar). ఇందు కోసం కొందరు వ్యక్తులు సింగపూర్ కు వెళ్లారని , త్వరలోనే వారు ఎవరో వివరాలు బయట పెడతానని చెప్పారు డీకే శివకుమార్.
ఇదిలా ఉండగా ఇటీవలే కర్ణాటకలో బీజేపీ సర్కార్ కు కోలుకోలేని షాక్ ఇచ్చారు రాష్ట్ర ప్రజలు. మొత్తం 224 సీట్లకు గాను కాంగ్రెస్ పార్టీకి 135 సీట్లు దక్కించు కోగా బీజేపీకి 65 సీట్లు వచ్చాయి. ఇక కింగ్ పిన్ అవుదామని అనుకున్న జేడీఎస్ చీఫ్ కుమార స్వామికి బిగ్ షాక్ తగిలింది. కేవలం 19 సీట్లకే పరిమితం చేశారు.
అయితే అంపశయ్యపై ఉన్న కాంగ్రెస్ పార్టీని పవర్ లోకి తీసుకు వచ్చేలా చేయడంలో కీలక పాత్ర పోషించారు డీకే శివకుమార్. ఆయన పార్టీ చీఫ్ గా కొలువు తీరాక సీన్ మార్చేశారు. మొత్తం స్ట్రాటజీని ఫాలో అవుతూ ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరుగెత్తేలా చేశారు. మొత్తంగా పవర్ లోకి వచ్చేలా చేశారు.
Also Read : Jairam Ramesh Modi : మోదీ మౌనం వీడక పోతే ఎలా