DK Shiva Kumar : కేబినెట్ పునర్ వ్యవస్థీకరణపై ఫోకస్
రాబోయే ఎన్నికలే టార్గెట్ గా ప్లాన్
DK Shiva Kumar : కర్ణాటకలో ఎవరు ఔనన్నా కాదన్నా డిప్యూటీ సీఎం , కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ కింగ్ మేకర్ అని చెప్పక తప్పదు. ఆయన ఒక్కడే పార్టీని ఒంటి చేత్తో మోశాడు. ప్రస్తుతం పార్టీని పవర్ లోకి తీసుకు రావడంలో కీలక పాత్ర పోషించారు. చివరి దాకా సీఎం రేసులో ఉన్నాడు. చివరకు పార్టీ సిద్దరామయ్యకు ఛాన్స్ ఇచ్చింది.
DK Shiva Kumar Development
ఎలాంటి ఆధిపత్య పోరు కొనసాగకుండా డీకే శివకుమార్(DK Shiva Kumar) ను బుజ్జగించింది. చివరకు డీకే డిప్యూటీ సీఎం అయినప్పటికీ మొత్తం తానే అయి వ్యవహరిస్తున్నారు. సమీక్షలు చేపట్టడం, పార్టీ పరంగా కామెంట్స్ చేయడం, ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల గురించి చెబుతున్నారు. అంతే కాదు పార్టీకి చెందిన ఎమ్మెల్యేలతో రివ్యూ కూడా ఏర్పాటు చేశారు.
ఇదే సమయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ పరంగా పవర్ లోకి వచ్చినా వచ్చే ఏడాది 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో సత్తా చాటేందుకు తమ కేబినెట్ లో మార్పులు చేయాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా సమీక్ష సమావేశంలో హింట్ కూడా ఇచ్చారు డీకే శివకుమార్.
30 మంది కాంగ్రెస్ శాసన సభ్యుల ఆందోళనల నేపథ్యంలో కొత్త టీంను నిర్మించాలని డిప్యూటీ సీఎం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ మేరకు కొత్త వారికి ఛాన్స్ ఇవ్వాలని, ఎంపీలను సాధ్యమైనంత మేర గెలిపించు కోవాలని ఫోకస్ పెట్టారు.
Also Read : BJP MLA’s Joining : కాంగ్రెస్ వైపు బీజేపీ ఎమ్మెల్యేల చూపు