DK Shiva Kumar : గృహలక్ష్మి కోసం కోటిన్నర మంది
డిప్యూటీ సీఎం డీకే శివకుమార్
DK Shiva Kumar : కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కీలక ప్రకటన చేశారు. ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీని అమలు చేసేందుకు శ్రీకారం చుట్టామన్నారు. ఇందులో భాగంగా గృహ లక్ష్మి కింద రాష్ట్ర వ్యాప్తంగా కోటిన్నర మంది ఆశావహులు దరఖాస్తు చేసుకున్నారని డీకే శివకుమార్(DK Shiva Kumar) వెల్లడించారు.
DK Shiva Kumar Words About Gruha Lakshmi
పెద్ద ఎత్తున అప్లికేషన్లు రావడం వల్ల కొంత ఆలస్యం జరుగుతోందని, ఎంపిక ప్రక్రియ కొనసాగుతోందని స్పష్టం చేశారు డిప్యూటీ సీఎం. ఈ ప్రాజెక్టును సమర్థవంతంగా అమలు చేసేందుకు గాను మంత్రులు, జిల్లా కలెక్టర్లతో కీలకమైన భేటీ జరిగిందన్నారు డీకే శివకుమార్.
పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చిన కారణంగా ఆగస్టు 20న బెల్గాంలో జరగాల్సిన గృహలక్ష్మి యోజన ప్రారంభ కార్యక్రమాన్ని ఆగస్టు 27న నిర్వహించాలని నిర్ణయించడం జరిగిందని చెప్పారు డిప్యూటీ సీఎం.
గతంలో కొలువు తీరిన బీజేపీ ప్రభుత్వం ప్రజలను ఇబ్బందులకు గురి చేసిందన్నారు. గృహాలు నిర్మిస్తామని చెప్పి మోసం చేసిందన్నారు డీకే శివకుమార్.
Also Read : Riyaz : రియాజ్ అరెస్ట్ రేవంత్ సీరియస్