DK Shiva Kumar : బాబుతో డీకే ములాఖత్
మారనున్న రాజకీయాలు
DK Shiva Kumar : బెంగళూరు – రాజకీయాలలో ఎవరు ఎప్పుడు ఎక్కడ ఉంటారో తెలియని పరిస్థితి నెలకొంది. శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరనేది జగమెరిగిన సత్యం. కర్ణాటక రాజకీయాలలో తలపండిన రాజకీయ నేత ఒకరు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. మరొకరు దేశంలోనే పేరు పొందిన పొలిటికల్ లీడర్, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు.
DK Shiva Kumar Met Chandrababu
టీడీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కీలక సమావేశానికి హాజరయ్యారు బాబు. ఈ సందర్బంగా డిప్యూటీ సీఎం డీకే శివకుమార్(DK Shiva Kumar) ఆయనను కలుసుకున్నారు. వీరిద్దరి కలయిక రాజకీయాలలో కలకలం చోటు చేసుకుంది.
ఇదిలా ఉండగా గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో జత కట్టారు తెలుగుదేశం పార్టీ చీఫ్. ఆ తర్వాత దూరంగా ఉన్నారు. ఇదే సమయంలో తన అనుచరుడిగా పేరు పొందిన ఎనుముల రేవంత్ రెడ్డి ఉన్నట్టుండి తన ముందే తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. దీంతో ఒక రకంగా రేవంత్ ముందున్నా నడిపించేదంతా చంద్రబాబు నాయుడేనన్న అపవాదు నెలకొంది.
ఇక తాజాగా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఏపీ సీఐడీ ఆయనపై పలు కేసులు నమోదు చేసింది. బాబుపై 8 స్కామ్ లకు పాల్పడినట్లు విమర్శలున్నాయి. ఈ తరుణంలో ఇండియా కూటమి ఆధ్వర్యంలో పలు పార్టీలు త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో కలిసి సాగాలని ఈ సందర్భంగా డీకే శివకుమార్ చంద్రబాబు నాయుడును కోరినట్లు సమాచారం.
Also Read : Bhatti Vikramarka : స్వేద పత్రం కాదు సోది పత్రం