DK Shiva Kumar : ఈ మట్టికి..ప్రజలకు రుణపడి ఉన్నా
కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్
DK Shiva Kumar : నేను ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను. నాపై ఎంతో అభిమానం కురిపిస్తూ వచ్చారు. జీవితాంతం మీకు సేవకుడిగా ఉంటా. మీరు నన్ను ఉన్నత స్థానంలో కూర్చోబెట్టారు. ఈ పదవి దక్కిందంటే కారణం మీరే. మీరు లేకుంటే నేను లేను. మీరు ఎంతో ఆదరణతో ఆప్యాయతతో కురిపిస్తున్న ఈ అంతులేని ప్రేమకు నేను సర్వదా రుణపడి ఉంటానని స్పష్టం చేశారు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్.
ఆయన స్వంత జిల్లా సిల్క్ సిటీగా పేరు పొందిన రామనగరకు వెళ్లారు. సోమవారం భారీ ఎత్తున రోడ్ షో చేపట్టారు. ఎక్కడ చూసినా డీకే అభిమానులు కనిపించారు. గ్రాండ్ వెల్ కమ్ చెప్పినందుకు డీకే శివకుమార్(DK Shiva Kumar) భావోద్వేగానికి లోనయ్యారు. ఒకానొక సమయంలో ఆయన కంటతడి పెట్టారు. తాను కష్టాల్లో ఉన్న సమయంలో నా వెంట మీరంతా ఉన్నారు. నన్ను సీఎంగా మీరు చూడాలని అనుకున్నారు. డిప్యూటీ సీఎంగా కొలువుతీరా. మీ ఆశీర్వాదం కోసం వచ్చాను.
నన్ను ముందు నుంచీ అక్కున చేర్చుకున్న మీకు, ఈ ప్రేమాస్పదమైన ఈ మట్టికి నేను రుణపడి ఉన్నానని స్పష్టం చేశారు డీకే శివకుమార్. ఇదిలా ఉండగా తాజాగా కర్నాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని రీతిలో కాంగ్రెస్ పార్టీ 135 సీట్లను కైవసం చేసుకుంది. బీజేపీ 65కే పరిమితం కాగా జేడీఎస్ 19తో సరి పెట్టుకుంది. నలుగురు ఇండిపెండెంట్లు గెలుపొందారు.
Also Read : Aditya Thackeray : షిండే సర్కార్ పై ఆదిత్యా ఆగ్రహం