DK Shiva Kumar : చిన్నారుల ఆరోగ్యానికి ప్రాధాన్యత
స్పష్టం చేసిన డిప్యూటీ సీఎం డీకే
DK Shiva Kumar : తమ ప్రభుత్వం చిన్నారుల ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేశారు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. బెంగళూరు లోని ఈసీపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శనివారం చిన్నారులకు పౌష్టిక ఆహారం పంపిణీ చేశారు. బంగారప్ప సీఎంగా ఉన్న సమయంలో పిల్లల్లో విద్య, పౌష్టిక ఆహారం పెంపుదలపై దృష్టి పెట్టారని గుర్తు చేశారు డీకే శివకుమార్.
DK Shiva Kumar Focusing on Education
ప్రస్తుతం తమ పరిపాలనలో విద్యా రంగానికి కొత్త రూపం తీసుకు రావాలని నిర్ణయించామని చెప్పారు. ఈ మేరకు పలువురితో సూచనలు తీసుకున్నానని తెలిపారు డిప్యూటీ సీఎం(DK Shiva Kumar). రాష్ట్రంలోని పాఠశాలలో ఎన్ని ఖాళీలు ఉన్నాయనే దానిపై కూడా ఆరా తీశానని చెప్పారు. ఇదే సమయంలో ఆయా బడుల్లో చదువుకుని ఉన్నత స్థానాల్లో ఉన్న వారు విద్యా సంస్థలను దత్తత తీసుకుంటే ఎలా ఉంటుందనే ఆలోచన కూడా ఉందన్నారు.
ప్రత్యేకించి నేర్చుకునే పిల్లలకు పౌష్టిక ఆహారం అత్యవసరం అన్నారు డీకే. ప్రభుత్వ బడుల అభివృద్దికి తమ సర్కార్ అధిక ప్రాధాన్యత ఇస్తుందని స్పస్టం చేశారు . పాఠశాల కార్యక్రమాన్ని పిల్లలే చెప్పాలన్నారు. విద్యార్థులకు అవసరమైన శిక్షణ, నైపుణ్యాలను పంతుళ్లు ఇవ్వాలని సూచించారు. ఆధునిక యుగంలో పిల్లలకు సాంకేతిక విద్యను అందించాలని కోరారు.
Also Read : TTD Board Members : టీటీడీ బోర్డు మెంబర్స్ పై కసరత్తు