DK Shiva kumar : అధికారం ఖాయం గ్యారెంటీలు తథ్యం
డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కామెంట్
DK Shiva kumar : తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల్లో ప్రజల తెలంగాణకు దొరల తెలంగాణకు మధ్య జరుగుతున్న పోరాటమని అభివర్ణించారు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్(DK Shiva kumar). ఇన్నేళ్లుగా కొలువు తీరిన బీఆర్ఎస్ సర్కార్ ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉందో చెప్పాలన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా డీకే శివకుమార్ ప్రసంగించారు.
DK Shiva kumar Comments Viral
దేశం అంతా ప్రస్తుతం తెలంగాణ వైపు చూస్తోందన్నారు. ఏం జరగబోతోందోనని, ఎవరు సీఎం పీఠాన్ని కైవసం చేసుకుంటారని కానీ ప్రజలు ఆల్ రెడీ డిసైడ్ అయి పోయారని ఆ విషయం తనకు ప్రజల నుంచి వస్తున్న స్పందనను చూస్తే తెలుస్తుందన్నారు డీకే శివకుమార్.
తాము అధికారంలోకి రావడం పక్కా అని వచ్చిన వెంటనే తొలి కేబినెట్ లోనే ఇచ్చిన ఆరు గ్యారెంటీలకు ఆమోద ముద్ర వేస్తామని స్పష్టం చేశారు . తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీకి విధేయేత చూపించేందుకు సిద్దమై ఉన్నారని పేర్కొన్నారు డిప్యూటీ సీఎం. కర్ణాటకలో తాము చెప్పినట్లుగానే అమలు చేస్తున్నామని , ఇక్కడ కూడా ఆరు గ్యారెంటీలకు ఢోకా లేదన్నారు.
ఇక సీఎం ఫామ్ హౌస్ కే పరిమితం కావడమో లేదా జైలుకు వెళ్లడమో చేయాల్సి ఉంటుందన్నారు. అన్ని పనులపై , ప్రాజెక్టుల ఖర్చుపై విచారణ తప్పక ఉంటుందన్నారు డీకే శివకుమార్.
Also Read : Revanth Reddy : బీఆర్ఎస్..బీజేపీతో కాదు ఈడీ..ఐటీతోనే పోటీ