DK Shiva Kumar : 12న కర్ణాటకలో కాంగ్రెస్ నిరసన
ప్రకటించిన డిప్యూటీ సీఎం డీకే
DK Shiva Kumar : కర్ణాటక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కీలక ప్రకటన చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్రంలో కొలువు తీరిన మోదీ , బీజేపీ సంకీర్ణ సర్కార్ కావాలని ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీపై కక్ష కట్టిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
ద్వేషం , కుతంత్రం, మోసం, హింస బీజేపీకి మూల స్తంభాలు అని మండిపడ్డారు. కులం పేరుతో, మతం పేరుతో, విద్వేషాల పేరుతో రాజకీయాలు చేస్తోందంటూ ఆరోపించారు డీకే శివకుమార్(DK Shiva Kumar). రాబోయే ఎన్నికల్లో రాహుల్ గాంధీ పోటీ చేయకుండా కుట్రలు పన్నారంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు డిప్యూటీ సీఎం.
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తమ నాయకుడు రాహుల్ గాంధీపై కక్ష గట్టాడని ఆరోపిస్తూ జూలై 12న బుధవారం బెంగళూరు లోని ఫ్రీడం పార్క్ వద్ద మౌన నిరసన చేపట్టనున్నట్లు ప్రకటించారు డీకే శివకుమార్.
ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు, మద్దతుదారులు, అభిమానులు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు ఉప ముఖ్యమంత్రి.
రాహుల్ గాంధీ మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ పరువు నష్టం కేసు దాఖలైంది. ఈ కేసుకు సంబంధించి సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ పై అహ్మదాబాద్ కోర్టు కీలక తీర్పు వెలువరించింది.
Also Read : Vasireddy Padma : పవన్ కామెంట్స్ మహిళా కమిషన్ ఫైర్
