DK Shiva Kumar : 11 నుంచి మహిళలకు ఉచిత ప్రయాణం
కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్
DK Shiva Kumar : పార్టీ ఎన్నికల ప్రచారంలో సందర్భంగా ఇచ్చిన ఐదు గ్యారెంట్ హామీలను అమలు చేస్తామని స్పష్టం చేశారు కాంగ్రెస్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ , డిప్యూటీ సీఎం డీకే శివకుమార్(DK Shiva Kumar) . ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. తాము ఇచ్చిన మాట ప్రకారం కట్టుబడి ఉంటామన్నారు. పేదలకు 200 యూనిట్ల వరకు విద్యుత్ బిల్లులు కట్టాల్సిన అవసరం లేదన్నారు. ఆ తర్వాత ఎక్కువగా వాడినట్లయితే బిల్లులు కట్టాల్సి ఉంటుందన్నారు. నిరుద్యోగులకు జాబ్స్ వచ్చేంత వరకు నిరుద్యోగ భృతి ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. గురువారం ట్విట్టర్ వేదికగా మరో కీలక ప్రకటన చేశారు డీకే శివకుమార్.
రాష్ట్రంలో ఏసీ బస్సులు తప్ప మిగతా ఎక్స్ ప్రెస్ , ఆర్డినరీ బస్సుల్లో మహిళలు, యువతులు, బాలికలకు ఉచితంగా ప్రయాణం చేసే సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు ప్రకటించామని ఇందుకు సంబంధించి దానిని కూడా తప్పకుండా అమలు చేసి తీరుతామన్నారు డీకే శివకుమార్. జూన్ 11 నుంచి మహిళలకు ఉచిత జర్నీ ప్రారంభం అవుతుందని చెప్పారు. కర్ణాటక రాష్ట్ర చరిత్రలో ఇదో సువర్ణ అధ్యాయంగా నిలిచి పోతుందని అభిప్రాయపడ్డారు డిప్యూటీ సీఎం.
ఇదిలా ఉండగా తాజాగా జరిగిన కర్ణాటక రాష్ట్ర ఎన్నికల్లో 224 సీట్లకు గాను కాంగ్రెస్ పార్టీ 135 సీట్లు కైవసం చేసుకుంది. బీజేపీ 65 సీట్లకే పరిమితం కాగా జీడీఎస్ 19 సీట్లు మాత్రమే వచ్చాయి. మిగతా నాలుగు సీట్లలో స్వతంత్ర ఎమ్మెల్యేలు గా గెలుపొందారు. వారంతా మూకుమ్మడిగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపారు. దీంతో 139 సీట్లకు పెరిగాయి.
Also Read : Rahul Gandhi : తమిళనాడును చూసి నేర్చుకోవాలి – రాహుల్