DK Shiva Kumar : మోడీ..కేసీఆర్ ఇద్దరూ ఒక్కటే
డిప్యూటీ సీఎం డీకే శివకుమార్
DK Shiva Kumar : కామారెడ్డి – కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సంచలన కామెంట్స్ చేశారు. తెలంగాణలో ఆరు నూరైనా సరే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని జోష్యం చెప్పారు. ఆదివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం కామారెడ్డిలో కాంగ్రెస్ విజయ భేరి సభలో పాల్గొని ప్రసంగించారు. సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిందన్నారు. ఆమెకు కృతజ్ఞతగా ఇవాళ తెలంగాణ ప్రజలు గిఫ్ట్ ఇవ్వ బోతున్నారని అన్నారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు.
DK Shiva Kumar Shocking Comments
ఆనాడు ఎన్నో అవమానాలు, ఎన్నో అడ్డంకులను ఎదుర్కొని తెలంగాణను ఇచ్చిందన్న విషయం గుర్తు పెట్టుకోవాలన్నారు డీకే శివకుమార్(DK Shiva Kumar). మోడీ, కేసీఆర్ ఇద్దరూ ఒక్కటేనని ఎద్దేవా చేశారు. వాళ్లు పార్ట్ నర్స్ . పార్లమెంట్ లో ప్రతి బిల్లుకు బీఆర్ఎస్ బీజేపీకి మద్దతు ఇచ్చిందని ఈ విషయం మరిచి పోతే ఎలా అని నిలదీశారు.
కాకమ్మ కబుర్లతో జనాన్ని బురిడీ కొట్టించాలని చూస్తే ఎలా అని మండిపడ్డారు. ప్రజలు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు సిద్దమై పోయారని స్పష్టం చేశారు. కర్ణాటకలో తాము 5 గ్యారెంటీలను అమలు చేయడం లేదంటూ కేసీఆర్ అబద్దాలు చెబుతున్నారంటూ ఆరోపించారు. కేసీఆర్, కేటీఆర్ లకు తాను సవాల్ చేస్తున్నానని ఎవరైనా, ఎప్పుడైనా కర్ణాటకకు వచ్చి చూసు కోవచ్చని అన్నారు డీకే శివకుమార్.
Also Read : PM Modi : ఫామ్ హౌస్ లో పడుకునే సీఎం అవసరమా