DK Shivakumar : ఈడీ స‌మ‌న్ల‌పై 26న నిర‌స‌న‌ – శివ‌కుమార్

ఆందోళ‌న‌కు త‌ర‌లి రావాలంటూ పిలుపు

DK Shivakumar : కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) కాంగ్రెస్ పార్టీ చీఫ్ సోనియా గాంధీకి స‌మ‌న్లు పంపించడాన్ని నిర‌సిస్తూ ఈనెల 26న కాంగ్రెస్ పార్టీ ఆధ్వ‌ర్యంలో శాంతియుత నిర‌స‌న చేప‌ట్ట‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు కేపీసీసీ చీఫ్ డీకే శివ‌కుమార్.

ఒక ర‌కంగా వేధింపుల‌కు గురి చేయ‌డం త‌ప్ప మ‌రొక‌టి కాద‌న్నారు. ఈ ఆందోళ‌న కార్య‌క్ర‌మానికి పార్టీకి చెందిన నాయ‌కులు, శ్రేణులు , కార్య‌క‌ర్త‌లు పాల్గొనాల‌ని డీకేఎస్ పిలుపునిచ్చారు.

గ‌తంలో ఐదు రోజుల పాటు కాంగ్రెస్ మాజీ చీఫ్ , వాయ‌నాడు ఎంపీ రాహుల్ గాంధీ(Rahul Gandhi) ని ఐదు రోజుల పాటు ఈడీ ప్ర‌శ్నించడాన్ని త‌ప్పు ప‌ట్టారు డీకే శివ‌కుమార్.

ఇప్ప‌టికే నేష‌న‌ల్ హెరాల్డ్ ప‌త్రిక కేసుకు సంబంధించి మ‌నీ లాండ‌రింగ్ జ‌రిగింద‌న్న ఆరోప‌ణ‌ల్లో వాస్త‌వం లేద‌ని ఆరోపించారు. ఇది పూర్తిగా క‌క్ష సాధింపు చ‌ర్య‌లో భాగ‌మేన‌ని పేర్కొన్నారు.

ఇప్ప‌టికే కేసు కొట్టి వేశార‌ని కానీ కావాల‌ని తిరగ దోడారంటూ మండిప‌డ్డారు డీకే శివ‌కుమార్. క‌ర్ణాట‌క‌లోనే కాకుండా దేశ వ్యాప్తంగా త‌మ పార్టీకి చెందిన నేత‌లకు స‌మ‌న్లు ఇవ్వడాన్ని నిర‌సిస్తూ ఆందోళ‌న‌లు, నిర‌స‌న‌లు కొన‌సాగుతాయ‌ని స్ప‌ష్టం చేశారు.

ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌ను అవ‌లంభిస్తూ కేంద్రంలో కొలువు తీరిన ప్ర‌భుత్వం ఇబ్బందుల‌కు గురి చేస్తోందంటూ ధ్వ‌జ‌మెత్తారు. ప్ర‌భుత్వ వ్య‌వ‌స్థ‌ల‌ను నిర్వీర్యం చేసిన ఘ‌న‌త మోదీకి ద‌క్కుతుంద‌న్నారు.

అధికారాన్ని అడ్డం పెట్టుకుని కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌ల‌ను వాడుకుంటోందంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు డీకే శివ‌కుమార్(DK Shivakumar). ఆదివారం క‌ర్ణాట‌క పీసీసీ చీఫ్ జాతీయ మీడియాతో మాట్లాడారు.

Also Read : మోదీ నిర్వాకం ర‌క్ష‌ణ రంగం నిర్వీర్యం

Leave A Reply

Your Email Id will not be published!