DK Shivakumar Katil : కటీల్ కామెంట్స్ డీకేఎస్ సీరియస్
లవ్ జిహాద్ పై కర్ణాటక పీసీసీ చీఫ్ ఫైర్
DK Shivakumar Katil : రహదారులు, సమస్యలు ప్రస్తావించకండి లవ్ జిహాద్ గురించి ఆలోచించండి అంటూ సంచలన కామెంట్స్ చేసిన కర్ణాటక రాష్ట్ర భారతీయ జనతా పార్టీ చీఫ్ నళిన్ కుమార్ కటీల్ పై నిప్పులు చెరిగారు కర్ణాటక రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ చీఫ్ డీకే శివకుమార్. ఇప్పటికే కాషాయ ప్రభుత్వం అవినీతి, అక్రమాల్లో నెంబర్ వన్ గా ఉందని ఎద్దేవా చేశారు.
ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన వాళ్లు బాధ్యతా రాహిత్యంగా మాట్లాడటం దారుణమన్నారు. బీజేపీ చీఫ్ కటీల్ బేషరతుగా రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు రాష్ట్రానికి బీజేపీ ప్రభుత్వం ఏం చేసిందో శ్వేత పత్రం విడుదల చేయాలన్నారు డీకే శివకుమార్. కటీల్ చేసిన ప్రకటన బాధ్యతా రాహిత్యాన్ని సూచిస్తోందన్నారు. ఆయన ఎదురు దాడి చేశారు.
ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఎవరిని ఎన్నుకుంటారో ప్రజలే నిర్ణయిస్తారని స్పష్టం చేశారు కర్ణాటక కాంగ్రెస్ పార్టీ చీఫ్. అభివృద్ది , ఉపాధి కల్పించడం బీజేపీ ప్రాధాన్యత కాదని నళిన్ కుమార్ కటీల్ చేసిన కామెంట్స్ తో రూఢీ అయ్యిందన్నారు. ఆ పార్టీ తమ స్వార్థం కోసం తప్పితే ప్రజల గురించి ఆలోచించదని ఆగ్రహం వ్యక్తం చేశారు డీకే శివకుమార్(DK Shivakumar).
రహదారులు, ఇతర సమస్యల గురించి ప్రస్తావించక పోతే ఇంకేం అడగాలని నిలదీశారు. ఇప్పటికే పలువురు ప్రభుత్వ నిర్ణయాల కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన చెందారు డీకే శివకుమార్. బీజేపీ సర్కార్ దెబ్బకు కాంట్రాక్టర్లు లంచాలు ఇచ్చుకోలేక సూసైడ్ చూసుకుంటున్నారని సంచలన ఆరోపణలు చేశారు కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్.
Also Read : అభివృద్ది వద్దు ‘మతం’ ముద్దు – కటీల్