Supreme Court : ‘మత మార్పిడి చట్టం’పై తీర్పు వద్దు
తీర్పు నిలుపుదల చేయాలన్న ఏజీ
Supreme Court : బలవంతంగా లేదా ప్రలోభాలకు గురి చేసి మత మార్పిడిని నిషేధించే చట్టం సాధ్యా సాధ్యాలపై భారత్ లా కమిషన్ ఈ అంశాన్ని పరిశీలించేంత దాకా సుప్రీంకోర్టు(Supreme Court) తీర్పును వెలువరించడం మాను కోవాలని అటార్నీ జనరల్ వెంకటరమణి కోరారు. ఈ మేరకు విచారణ సందర్భంగా మరోసారి పరిశీలించాలని సూచించారు.
కేసుకు సంబంధించి శిక్షార్హ చట్టం సాధ్యా సాధ్యాలను పరిశీలించాల్సిందిగా లా కమిషన్ ను కోరాలని న్యాయవాది అశ్విన్ ఉపాధ్యాయ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను న్యాయమూర్తులు జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ జేబీ పార్థివాలాతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది.
పూర్తిగా సాధ్య సాధ్యాల గురించి పరిశీలిస్తోంది. ఒక సారి ఈ కోర్టు ఏదో చెబితే లా కమిషన్ చేయగలిగింది ఏమీ లేదు. లా కమిషన్ సంప్రదింపులు మొదటి దశగా మాత్రమే సరైనద అని భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయమూర్తి ధనంజయ వై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనానికి ఏజీ వెంకట రమణి తెలిపారు.
తీర్పు లేదా కొన్ని ఉత్తర్వుల రూపంలో సుప్రీంకోర్టు నుండి వచ్చిన మార్గదర్శకాన్ని అనుసరించి లా కమిషన్ సమస్యను పరిశీలించడం సరైనదని బెంచ్ ప్రాథమిక అభిప్రాయాన్ని కలిగి ఉందని వెంకటరమణి వాదించారు. దీనిని ప్రత్యేకంగా విభేదించారు.
దేశంలోని అత్యున్నత న్యాయ అధికారి ప్రకారం సుప్రీంకోర్టు నుండి వచ్చిన ఏదైనా పదం కమిషన్ పరీక్ష పరిధిని పరిమితం చేస్తుందని , అందువల్ల బలవంతపు మత మార్పిడి అంశాన్ని మొదటి సందర్భంలో పరిగణించేందుకు కోర్టు అనుమతించాలని కోరారు ఏజీ.
Also Read : జాక్వెలిన్.. పింకీ ఇరానీ కీలకం