Mallikarjun Kharge : ఘటన బాధాకరం రాజకీయం చేయం
గుజరాత్ బ్రిడ్జి కూలిన ఘటనపై ఖర్గే
Mallikarjun Kharge : కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆదివారం రాత్రి 150 ఏళ్ల చరిత్ర కలిగిన గుజరాత్ రాష్ట్రంలోని మచ్చు నదిపై ఉన్న వంతెన ఉన్నట్టుండి కూలి పోయింది. ఛత్ పూజ కోసం బయలు దేరిన 500 మంది వంతెనపై ఉండడంతో ఒక్కసారిగా కిందకు పడి పోయింది.
ఈ ఘటనలో ఇప్పటి వరకు 141 మంది చని పోయినట్లు సమాచారం. 171 మందికి పైగా రక్షించారు. రెస్క్యూ టీం గాలింపు చర్యలు చేపడుతోంది. యావత్ దేశం ఈ ఘటనపై సంతాపం తెలియ చేస్తోంది. ఈ ఘటన చోటు చేసుకోవడంపై పార్టీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ సైతం వారికి ప్రగాఢ సానుభూతిని తెలియ చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఆయన చేపట్టిన భారత్ జోడో యాత్ర తెలంగాణలో కొనసాగుతోంది ప్రస్తుతం శంషాబాద్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే గుజరాత్ ఘటనపై స్పందించారు. సోమవారం మీడియాతో మాట్లాడారు. ఘటన బాధాకరం.
దీని గురించి రాజకీయం చేయదల్చు కోలేదని స్పష్టం చేశారు. బాధిత కుటుంబాలకు సహాయ, సహకారాలు అందించాల్సిందిగా రాష్ట్ర పార్టీ చీఫ్ తో పాటు నాయకులు, కార్యకర్తలను ఆదేశించడం జరిగిందని చెప్పారు మల్లికార్జున్ ఖర్గే(Mallikarjun Kharge). కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటన అత్యంత విషాదకరం. ఇలాంటివి మళ్లీ పునరావృతం కాకుండా చూడాలని సూచించారు.
ఈ విషయంలో ఒకరిని నిందించడం వల్ల ఒరిగేది ఏమీ ఉండదన్నారు ఖర్గే. అవసరమైతే సుప్రీంకోర్టు జడ్జితో విచారణ చేపట్టాలని కోరారు.
Also Read : గుజరాత్ పరివర్తన్ సంకల్ప యాత్ర