Owaisi Modi : జిన్ పింగ్ ను చూసి మోదీ జంకుతున్నారా
భారత్ గైర్హాజరీపై నిప్పులు చెరిగిన ఓవైసీ
Owaisi Modi : ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ(Owaisi) షాకింగ్ కామెంట్స్ చేశారు. చైనాను చూసి భయపడ్డారా అంటూ నిలదీశారు. చైనా లోని జిన్ జియాంగ్ ప్రాంతంలోని మానవ హక్కుల పరిస్థితిపై చర్చను కోరుతూ చేపట్టిన ముసాయిదా తీర్మానానికి దూరంగా ఉండాలన్న దానిపై భారత్ ఎందుకు దూరంగా ఉందో చెప్పాలని ఓవైసీ డిమాండ్ చేశారు.
ప్రధాన మంత్రి మోదీ ఏమైనా చైనా చీఫ్ జిన్ పింగ్ ను చూసి భయపడ్డారా అని ప్రశ్నించారు. గతంలో ఐక్య రాజ్య సమితిలో చేపటిన మానవ హక్కుల మండలిలో చర్చకు పిలుపునిచ్చిన ప్రతిసారి భారత్ ఎందుకు తాత్సారం చేయడమో లేదా గైర్హాజర్ కావడం జరుగుతోందన్నారు.
ముఖ్యమైన ఓటింగ్ కు దూరంగా ఉండటం ద్వారా ఒక రకంగా చైనాకు మద్దతు తెలిపినట్లు అవుతుందని పేర్కొన్నారు ఓవైసీ. దీన్ని బట్టి చూస్తే భారత్ భయాందోళనకు గురవుతున్నట్లు అనిపిస్తోందన్నారు. మరో వైపు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి షామా మహ్మద్ కూడా మోడీ పై నిప్పులు చెరిగారు.
చైనాలో ఉయ్ఘర్ మానవ హక్కుల ఉల్లంఘనలపై చర్చ కోసం ముసాయిదా తీర్మానానికి భారత్ ఎందుకు దూరంగా ఉందో దేశ ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. మానవ హక్కుల ఉల్లంఘన ఎక్కడ జరిగినా నేరమే. దీనిని ప్రతి ఒక్కరు ఖండించాల్సిందేనని పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా జిన్ జియాంగ్ (Xi Jinping) ప్రాంతంలోని మానవ హక్కుల పరిస్థితిపై చర్చను కోరుతూ ముసాయిదా తీర్మానానికి దూరంగా ఉండాలన్న తన నిర్ణయంపై భారత్ పరంగా వివరణ ఇవ్వలేదు. దీనిపై పెద్ద రాద్దాంతం జరుగుతోంది.
Also Read : ప్రధాన మంత్రి కాదు ప్రచార మంత్రి – కేటీఆర్