Dokka Manikya Vara Prasad : వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వర ప్రసాద్ సంచలన కామెంట్స్ చేశారు. తెలుగుదేశం పార్టీపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఓట్ల రాజకీయం చేయడం మానుకోవాలని సూచించారు. కేవలం ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని వ్యక్తిగత విమర్శలకు దిగడం, దిగజారడం దారుణమని పేర్కొన్నారు. రాష్ట్రంలో మాల, మాదిగలను , నిమ్న వర్గాలను మోసం చేసిన ఘనత చంద్రబాబు నాయుడిదని మండిపడ్డారు.
పేదల సంక్షేమం కోసం పాటు పడిన వ్యక్తి జగన్ రెడ్డి అని పేర్కొన్నారు. మాల, మాదిగల అభ్యున్నతి కోసం ఇప్పటికే ఎన్నో పథకాలు, కార్యక్రమాలను అమలు చేశారని స్పష్టం చేశారు డొక్కా మాణిక్య వర ప్రసాద్(Dokka manikya Vara Prasad). ఎంత కాలం ఇలా ప్రజలను మోసం చేస్తూ వస్తారని ప్రశ్నించారు. ఆనాడు తాను అణగారిన వర్గాలకు ప్రయారిటీ ఇవ్వాలని, వారిని ఆదుకోవాల్సిన అవసరం ఉందని చెప్పినా వినిపించు కోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
టీడీపీ ఆధ్వర్యంలో మాదిగ సామాజిక వర్గానికి సంబంధించి సమావేశం నిర్వహించారని, కానీ అక్కడ మాల, మాదిగలకు సంబంధించి ఏ ఒక్క అంశం మాట్లాడలేదని మండిపడ్డారు. మాదిగలకు ఏం చేస్తామని చెప్పలేదన్నారు. కేవలం జగన్ మోహన్ రెడ్డిని తిట్టడానికే ఈ వేదికను ఉపయోగించు కున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు డొక్కా మాణిక్య వర ప్రసాద్.
మాదిగ సమాజానికి ఇప్పటి వరకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. కేవలం ఎన్నికల్లో మాల, మాదిగలను ఓటు బ్యాంకుగా వాడుకునేందుకే దీనిని ఉపయోగించు కున్నారని ఆరోపించారు.
Also Read : Margadarshi CID Case : రూ. 242 కోట్ల మార్గదర్శి ఆస్తులు అటాచ్