Revanth Reddy : 24 గంటలలోపు క్ష‌మాప‌ణ చెప్పాలి

దొమ్మ‌ర కుల సంఘం డిమాండ్

Revanth Reddy : టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి త‌న నోటి దురుసు త‌గ్గించాల‌ని హెచ్చ‌రించారు దొమ్మ‌ర కుల సంఘం నాయ‌కులు. ఆయ‌న కుల దుర‌హంకారంతో ప‌దే ప‌దే బ‌హుజన కులాల‌ను కించ ప‌ర్చేలా ప‌దే ప‌దే మాట్లాడుతున్నాడంటూ ఆరోపించారు. రేవంత్ రెడ్డి ఇలాగే నోరు జారితే త‌మ చేతుల్లో దెబ్బ‌లు తినాల్సి వ‌స్తుంద‌ని హెచ్చ‌రించారు.

Revanth Reddy TPCC Chief

త‌మ సామాజిక వ‌ర్గం ప‌ట్ల కించ ప‌రిచేలా మాట్లాడ‌టం మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు దొమ్మ‌ర కుల సంఘం నేత‌లు. రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ దిష్టి బొమ్మ‌ల‌ను ఊరూరా ఊరేగించాల‌ని, చెప్పు దెబ్బ‌ల‌తో నిర‌స‌న వ్య‌క్తం చేయాల‌ని తెలంగాణ రాష్ట్ర దొమ్మరుల సంఘం , తెలంగాణ సంచార జాతుల సంఘాలు సంయుక్తంగా పిలుపునిచ్చాయి.

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth Reddy) త‌న కామెంట్స్ ను 24 గంట‌ల లోపు వెన‌క్కి తీసుకోవాల‌ని లేక పోతే తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కోవాల్సి వుంటుంద‌ని హెచ్చ‌రించారు. రాష్ట్ర దొమ్మ‌ర స‌మాజానికి బేష‌ర‌తుగా క్షమాప‌ణ చెప్పి తీరాల్సిందేన‌ని స్ప‌ష్టం చేశారు. లేక‌పోతే రేవంత్ రెడ్డికి దొమ్మ‌ర‌ల‌తో చెప్పు దెబ్బ‌ల‌తో స‌మాధానం చెప్ప‌డం జ‌రుగుతుంద‌న్నారు. కేవలం రెడ్డి సామాజిక వ‌ర్గానికి మాత్ర‌మే ప్ర‌యారిటీ ఇస్తున్న రేవంత్ రెడ్డికి త్వ‌ర‌లోనే బుద్ది చెప్ప‌డం ఖాయ‌మ‌న్నారు.

Also Read : Pawan Kalyan : అవినీతికి కేరాఫ్ ఏపీ స‌ర్కార్

Leave A Reply

Your Email Id will not be published!