Trump Twitter Re Open : మస్క్ పోల్..డొనాల్డ్ ట్రంప్ రీ ఎంట్రీ
మాజీ చీఫ్ ట్విట్టర్ ఖాతా పునరుద్దరణ
Trump Twitter Re Open : అంతా ఊహించినట్టే జరిగింది. అమెరికా దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Trump Twitter Re Open) కు ఖుష్ కబర్ చెప్పారు ట్విట్టర్ బాస్ , టెస్లా సిఇఓ, చైర్మన్ ఎలాన్ మస్క్. ఇటీవల యుఎస్ లో జరిగిన ఎన్నికల్లో చోటు చేసుకున్న హింసకు ప్రధాన కారకుడు ట్రంప్ అంటూ సోషల్ మీడియా దిగ్గజ సంస్థలు చర్యలు తీసుకున్నారు.
ఈ మేరకు అప్పటి లీగల్ హెడ్ గా ఉన్న విజయా గద్దె ట్రంప్ ట్విట్టర్ ఖాతాను నిషేధించాలని నివేదిక అందజేసింది. మైక్రో బ్లాగింగ్ సంస్థ ద్వారా ప్రజలను రెచ్చగొట్టేలా ప్రయత్నం చేశారంటూ ట్విట్టర్ సంస్థ భావించింది. ఈ మేరకు శాశ్వతంగా ట్రంప్ ఖాతాను క్లోజ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఒక రకంగా కోలుకోలేని షాక్ తగిలింది ట్రంప్ కు.
ఒకానొక దశలో అమెరికాను శాసించిన తనను మీరేంటి బ్యాన్ చేసేది అంటూ మండిపడ్డాడు. ఆపై తానే ఓ సోషల్ మీడియాను ఓపెన్ చేశాడు. ఇది ఇంకా ప్లాట్ ఫారమ్ మీదకు రాలేదు. ఈ తరుణంలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి ట్విట్టర్ లో. ప్రముఖ వ్యాపారవేత్త, ప్రపంచ కుబేరుల్లో టాప్ లో ఉన్న ఎలాన్ మస్క్ ట్విట్టర్ ను రూ. 4,400 కోట్లకు కొనుగోలు చేశాడు.
దీంతో డొనాల్డ్ ట్రంప్ కు లైన్ క్లియర్ అయ్యింది. ఇదిలా ఉండగా ఎలాన్ మస్క్ కు ట్రంప్ కు వ్యాపార, వాణిజ్య సంబంధాలు ఉన్నాయి. దీంతో ట్విట్టర్ ను టేకోవర్ చేసుకున్నాక చాలా మందిని తొలగించాడు. ఆపై ట్రంప్ ఖాతా ను పునరుద్దరించాలా లేదా అని పోల్ చేపట్టాడు మస్క్. 51. 8 శాతం మంది ట్రంప్ ఖాతాను పునరుద్దరించాలని కోరారు. దీంతో రీ ఓపెన్ అయ్యింది.
Also Read : ట్విట్టర్ లో కొనసాగుతున్న కొలువుల కోత