Donald Trump : 2024లో జరిగే ఎన్నికల్లో పోటీ చేస్తా – ట్రంప్
సంచలన ప్రకటన చేసిన మాజీ ప్రెసిడెంట్
Donald Trump : అమెరికా దేశ మాజీ అధ్యక్షుడు రిపబ్లికన్ పార్టీ చీఫ్ డొనాల్డ్ ట్రంప్(Donald Trump) సంచలన ప్రకటన చేశారు. ఆయన గత వారం కిందట కీలక ప్రకటన చేయబోతున్నానని అమెరికన్లు వేచి చూడాలని కోరారు. ఈ మేరకు మంగళవారం అర్ధరాత్రి మీడియాతో మాట్లాడారు. తాను దేశంలో 2024లో జరిగే ఎన్నికల్లో పోటీకి దిగుతానని ప్రకటించారు.
ఇందులో ఎలాంటి అనుమానం లేదన్నారు. మాయ మాటలతో, ఆచరణకు నోచుకోని హామీలతో జో బైడెన్ పార్టీ అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. డొనాల్డ్ ట్రంప్ ప్రధానంగా ప్రస్తుత సర్కార్ ను టార్గెట్ చేశారు. దేశంలో తీవ్రమైన సంక్షోభం నెలకొందని, అమెరికన్లకు భద్రత లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
విదేశాంగ విధానంలో అమెరికా అనుసరించిన విధానం పూర్తిగా నవ్వులపాలు అయ్యేలా చేసిందని ఎద్దేవా చేశారు. దేశానికి బాధ్యత కలిగిన ప్రెసిడెంట్ చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారంటూ డొనాల్డ్ ట్రంప్(Donald Trump) ఆరోపించారు. ఇక నుంచి ఇప్పటి నుంచే తాను ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తానని ప్రకటించారు.
ప్రజలు ప్రస్తుత జో బైడెన్ పాలన పట్ల విసుగు చెంది ఉన్నారని అత్యధిక శాతం తమ వైపు చూస్తున్నారని అన్నారు. దేశంలోని రిపబ్లికన్ పార్టీకి చెందిన శ్రేణులు మరోసారి అధికారంలోకి వచ్చేందుకు కృషి చేయాలని డొనాల్డ్ ట్రంప్ పిలుపునిచ్చారు.
ట్రంప్ వైట్ హౌస్ కోసం తన మూడవ ప్రచారానికి శ్రీకారం చుడుతున్నట్లు ప్రకటించడం రాజకీయ వర్గాలలో ఆసక్తిని రేపింది. దీనిని లైట్ తీసుకుంటున్నారు అధికారంలో ఉన్న డెమోక్రెట్లు. తమ పాలన బాగానే ఉందని ట్రంప్ నిర్వాకం వల్లనే ఈ సమస్యలు తలెత్తాయని ఆరోపిస్తున్నారు.
Also Read : మెటా పబ్లిక్ పాలసీ డైరెక్టర్ గా తుక్రాల్