CM KCR : ఎమ్మెల్యేలను మార్చం ముందస్తుకు వెళ్లం – కేసీఆర్
షెడ్యూల్ ప్రకారమే రాష్ట్రంలో ఎన్నికలు
CM KCR : టీఆర్ఎస్ పార్టీ చీఫ్ , తెలంగాణ సీఎం కేసీఆర్ సంచలన ప్రకటన చేశారు. గత కొంత కాలం నుంచి కేసీఆరర్ ముందస్తు ఎన్నికలకు వెళతారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే టీఆర్ఎస్ ను భారత రాష్ట్ర సమితిగా మార్చారు. ఈ మేరకు అంతిమంగా పార్టీ నిర్ణయాన్ని ప్రకటించారు.
మంగళవారం హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఇటీవల మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ గెలుపొందిన విషయం విదితమే. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయనే దానిపై మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, చైర్మన్లు, పార్టీ నాయకులు, శ్రేణులకు స్పష్టమైన సందేశం ఇచ్చారు.
ముందస్తు ఎన్నికలకు వెళ్లబోమంటూ కుండ బద్దలు కొట్టారు. ఇక నుంచి పార్టీ శ్రేణులు, కార్యకర్తలు ఇప్పటి నుంచే వచ్చే ఎన్నికలకు సిద్దం కావాలని పిలుపునిచ్ఆచరు. ప్రభుత్వ పథకాలను, కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు కృషి చేయాలని ఆదేశించారు సీఎం కేసీఆర్(CM KCR). ఇక వచ్చే శాసనసభ ఎన్నికల్లో ఎమ్మెల్యేలను మార్చే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు.
మళ్లీ పాత వారికే టికెట్లు కేటాయిస్తామని చెప్పారు సీఎం. ఎన్నికలకు ఇంకా 10 నెలల సమయం మాత్రమే ఉందన్నానరు. ఎమ్మెల్యే ప్రతి ఒక్కరు ప్రజలతో మమేకం కావాలని వారితో మాట్లాడాలని, వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని కోరారు.
కొందరు చేస్తున్న ప్రచారాన్ని నమ్మవద్దని కోరారు. ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే సర్కార్ దృష్టికి తీసుకు రావాలని కోరారు. రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ మళ్లీ పవర్ లోకి రావడం ఖాయమన్నారు.
Also Read : గొప్ప ఆత్మీయుడిని కోల్పోయాను – కేసీఆర్