Google CEO : కాలన్నీ కాసులతో కొలవకండి – సుందర్ పిచాయ్
తన సక్సెస్ సీక్రెట్ ఏమిటో చెప్పిన సిఇఓ
Google CEO : ప్రపంచ టెక్ దిగ్గజ కంపెనీకి సిఇఓగా ఉన్న భారత దేశానికి చెందిన సుందర్ పిచాయ్(Google CEO) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన తన సక్సెస్ వెనుక రహస్యం ఏమిటో చెప్పాడు.
కాలాన్ని గుర్తించి సద్వినియోగం చేసుకుంటే విజయం దానంతట అదే వస్తుందన్నారు సిఇఓ. ప్రేరణగా నిలుస్తూ విజయాలు సాధించిన వారిని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.
ఇటీవల జరిగిన ఉద్యోగుల సమావేశంలో సుందర్ పిచాయ్(Google CEO) పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. మీ విజయం వెనుక రహస్యం ఏమిటంటే కాలాన్ని గుర్తించడం తప్ప మరొకటి కాదన్నారు.
ప్రతి దానిని డబ్బులతో కొలవ లేమన్నారు. సరదాగా సమయాన్ని డబ్బులతో పోల్చవద్దని సిబ్బందిని కోరారు. ఈ మీటింగ్ లో ఉద్యోగుల్లో ఒకరు లాభాలు , అధిక నగదు నల్విలను నమోదు చేసినప్పటికీ గూగుల్ సెలవులు, అలవెన్సులను ఎందుకు తగ్గించిందంటూ ప్రశ్నించారు సుందర్ పిచాయ్ ని.
గూగుల్ చిన్నగా , స్క్రాపీగా ఉన్నప్పుడు గుర్తుంది. సరదా ఎప్పుడూ ఉండదు. మనం దానిని డబ్బులతో సమానం చేయకూడదని స్పష్టం చేశారు గూగుల్ సిఇఓ.
మీరంతా కష్టపడి పనిచేసి స్టార్టప్ లోకి ప్రవేశించ వచ్చని తాను భావిస్తున్నట్లు చెప్పారు. ప్రజలు సరదాగా ఉండవచ్చు ఇది ఎల్లప్పుడూ డబ్బులతో సమానంగా ఉండ కూడదన్నారు.
గత దశాబ్దంలో ఎదురవుతున్న అత్యంత కఠినమైన స్థూల ఆర్థిక పరిస్థితులలో ప్రతి ఒక్కరం మరింత బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు గూగుల్ సిఇఓ.
ప్రతి పనిలో నిర్ణయాలు తీసుకోవడంలో కొంత నెమ్మదిగా ఉండవచ్చు. 20 శాతం ఉత్పాదకతను కలిగి ఉండేలా చూడాలన్నారు గూగుల్ సిఇఓ.
Also Read : ఆర్థిక మంత్రి షాకింగ్ కామెంట్స్