#FCUK : FCUK తొలి పాటను విడుదల చేయనున్నడాక్టర్ గురవారెడ్డి
FCUK : సాదారణంగా సినిమాలకు సంబంధించిన కార్యక్రమాలను సినీ ప్రముఖులతో జరిపిస్తుండటం ఆనవాయితీగా వస్తోంది. కానీ కరోనా కష్టకాలంలో ఇతరులను కాపాడటానికి ప్రాణాలను పణంగా పెట్టిన నిజ మైన హీరోలైన
FCUK : సాదారణంగా సినిమాలకు సంబంధించిన కార్యక్రమాలను సినీ ప్రముఖులతో జరిపిస్తుండటం ఆనవాయితీగా వస్తోంది. కానీ కరోనా కష్టకాలంలో ఇతరులను కాపాడటానికి ప్రాణాలను పణంగా పెట్టిన నిజ మైన హీరోలైన ఫ్రంట్‌లైన్ వారియర్స్‌తో శ్రీ రంజిత్ మూవీస్ తన F.C.U.K ని పాటలను విడుదల చేయిస్తామంటూ ఈ చిత్ర హీరో జగపతి బాబు చేప్పినట్టే ఈ చిత్రంలో పాటలను వైద్య రంగ నిపుణులు, పోలీసులు, మునిసిపల్ కార్మికులతో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ ఏర్పాట్లు చేసింది.
ఇందులో భాగంగానే F.C.U.K (ఫాదర్ చిట్టి ఉమా కార్తిక్) సినిమా నుంచి మొదటి పాటను ప్రముఖ వైద్య నిపుణులు గురవారెడ్డి విడుదల చేయనున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను చిత్ర నిర్మాత కెఎల్ దామోదర్ ప్రసాద్ , చిత్ర దర్శకుడు విద్యాసాగర్ రాజు మీడియాతో మాట్లాడుతూ కోవిడ్ 19 కి వ్యతిరేకంగా ఫ్రంట్‌లైన్ యోధులుగా ఉన్న ధైర్యవంతులుగా వారికి కృతజ్ఞతా చిహ్నంగా తమ సినిమాలో పాటలను విడుదల చేస్తున్నట్టు చెప్పారు. ఈ క్రమంలో తొలి పాటను 25వ తేదీ సోమవారం డాక్టర్ గురవారెడ్డి విడుదల చేయనున్నట్ట ప్రకటించారు.
No comment allowed please