DR KA Paul : విశాఖ స్టీల్ ఫ్యాక్ట‌రీని కొనేందుకు రెడీ

ప్ర‌జాశాంతి పార్టీ చీఫ్ షాకింగ్ కామెంట్స్

DR KA Paul : ఏపీలో రాజ‌కీయాలు ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ చుట్టే తిరుగుతున్నాయి. విశాఖ ఉక్కు ప‌రిశ్ర‌మ‌ను ప్రైవేటీక‌ర‌ణ చేసేందుకు కేంద్రం య‌త్నిస్తోందంటూ ఆరోపిస్తున్నాయి ప్ర‌తిప‌క్షాలు. అదానీ లేదా ఇత‌ర వ్యాపార‌వేత్త‌ల‌కు క‌ట్ట‌బెట్టే ఆలోచ‌న‌లో మోదీ ఉన్నారంటూ పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు ఉన్నాయి. ఇదే స‌మ‌యంలో బిడ్ కోసం స్టీల్ ప్లాంట్ ద‌ర‌ఖాస్తులు ఆహ్వానించింది.

దీనిపై సీరియ‌స్ గా స్పందించారు ప్ర‌జాశాంతి పార్టీ చీఫ్ డాక్ట‌ర్ కేఏ పాల్(DR KA Paul). విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణ‌ను అడ్డుకుంటాన‌ని, అవ‌స‌ర‌మైతే తాను ప్రాణం ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నాన‌ని స్ప‌ష్టం చేశారు. ఇదే స‌మ‌యంలో తాను విశాఖ ఉక్కు ప‌రిశ్ర‌మ‌ను కొనుగోలు చేసేందుకు రెడీ అని సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌చేశారు కేఏ పాల్.

ఇందు కోసం రూ. 42 వేల కోట్ల‌కు బిడ్ వేయ‌నున్న‌ట్లు తెలిపారు. 15 రోజుల్లో రూ. 4 వేల కోట్లు అడ్వాన్స్ గా ఇస్తాన‌ని తెలిపారు. కాగా స్థానికులు, అన్ని వ‌ర్గాల‌కు చెందిన ప్ర‌జ‌లు, ప్ర‌జా సంఘాలు, ఉద్యోగులు, నాయ‌కులు పెద్ద ఎత్తున నిర‌స‌న తెలియ చేస్తున్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హ‌క్కు అని దానిని వ‌దులుకునే ప్ర‌స‌క్తి లేద‌ని హెచ్చ‌రిస్తున్నారు. విశాఖ ఉక్కు విలుల రూ. 3.5 ల‌క్ష‌ల కోట్లు ఉంటుంద‌ని , కానీ కేంద్రం దానిని రూ. 3,500 కోట్ల‌కు అమ్మాల‌ని చూస్తోందంటూ కేఏ పాల్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.

Also Read : అకాల వ‌ర్షం కేసీఆర్ అభ‌య హ‌స్తం

Leave A Reply

Your Email Id will not be published!