KA Paul : కేసీఆర్ ఆరోగ్యంపై పాల్ ఆరా

ఆయ‌న దేవుడికి ద‌గ్గ‌ర‌గా ఉన్నారు

KA Paul : హైద‌రాబాద్ – ఎర్ర‌వెల్లి ఫామ్ హౌస్ లోని బాత్రూంలో జారి ప‌డి య‌శోద ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు బీఆర్ఎస్ బాస్, మాజీ సీఎం కేసీఆర్ ను ప‌రామ‌ర్శించేందుకు క్యూ క‌ట్టారు. ఇందులో వివిధ రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులు ఉన్నారు. ప్ర‌జా శాంతి పార్టీ చీఫ్ డాక్ట‌ర్ కేఏ పాల్ కేసీఆర్ ను ప‌రామ‌ర్శించారు. ఆయ‌న ఆరోగ్యంపై ఆరా తీశారు.

KA Paul Met KCR

అనంత‌రం మీడియాతో మాట్లాడారు కేఏ పాల్(KA Paul). ఈ సంద‌ర్బంగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మాజీ సీఎం కేసీఆర్ దైవానికి ద‌గ్గ‌ర‌గా అవుతున్నారంటూ బాంబు పేల్చారు. ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు క‌ల‌క‌లం రేపాయి. దీనిపై క్లారిటీ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు ప్ర‌జా శాంతి పార్టీ చీఫ్.

కేసీఆర్ ఆరోగ్యంగా ఉన్నార‌ని, తాను త్వ‌ర‌లోనే బ‌య‌ట‌కు వ‌స్తాన‌ని త‌న‌తో చెప్పార‌ని అన్నారు. రాజ‌కీయాల‌లో ఒక‌రిపై మ‌రొక‌రు ఆరోప‌ణ‌లు చేసుకోవ‌డం స‌హ‌జ‌మేన‌ని పేర్కొన్నారు డాక్ట‌ర్ కేఏ పాల్. అయితే వ్య‌క్తిగ‌తంగా ప‌ల‌క‌రించ‌డం స‌త్ సంప్ర‌దాయ‌మ‌ని స్ప‌ష్టం చేశారు.

ఇదిలా ఉండ‌గా సీఎం రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ ను ప‌ల‌కరించ‌డంపై ప్ర‌శంస‌లు కురిపించారు . రాజ‌కీయ ప‌రంగా ఇది మంచి ప‌రిణామ‌మ‌ని పేర్కొన్నారు. ఇలాంటి వాతావ‌ర‌ణం చూడ‌క చాలా ఏళ్ల‌వుతోంద‌ని స్ప‌ష్టం చేశారు.

Also Read : Serial Killer Arrest : సీరియ‌ల్ కిల్ల‌ర్ అరెస్ట్

Leave A Reply

Your Email Id will not be published!