Draupadi Murmu Bhadrachalam : రామయ్య సన్నిధిలో రాష్ట్రపతి
సమాజ అభివృద్ది అందరి బాధ్యత
Draupadi Murmu Bhadrachalam : తెలంగాణలో ఐదు రోజుల టూర్ లో భాగంగా శ్రీశైలంలో కొలువైన మల్లికార్జున స్వామి, భ్రమరాంభికా దేవిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం భద్రాద్రిలో కొలువు తీరిన రామయ్యను సందర్శించారు. సీతా, రాములకు పూజలు చేశారు. రాష్ట్రపతిగా ఎన్నికైన అనంతరం తొలిసారిగా ఆమె ఏపీలోని తిరుమలను సందర్శించారు. ప్రస్తుతం ఆలయాలను సందర్శించడం ఓ పనిగా పెట్టుకున్నారు.
ఇక భద్రాద్రి రామయ్య కోసం వచ్చిన ద్రౌపది ముర్ముకు(Draupadi Murmu) ఘన స్వాగతం లభించింది. భారీ ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేశారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతించారు. దర్శనం చేసుకున్న అనంతరం రాష్ట్రపతికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఓ జ్ఞాపికను కూడా బహూకరించారు.
అనంతరం కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ప్రసాద్ పథకాన్ని ప్రారంభించారు. రాష్ట్రపతి వెంట రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ , మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, సత్యవతి రాథోడ్ ఉన్నారు. ఈ సందర్భంగా ద్రౌపది ముర్ము కీలక వ్యాఖ్యలు చేశారు. సమాజ అభివృద్దిలో ప్రతి ఒక్కరు కీలక పాత్ర పోషించాలన్నారు.
పిల్లలకు సంస్కారం నేర్పించాల్సిన బాధ్యత వారి పెరెంట్స్ తో పాటు టీచర్లపై కూడా ఉందని స్పష్టం చేశారు. దేశ భవిష్యత్తు నేటి యువతపై ఉందని పేర్కొన్నారు రాష్ట్రపతి. అయితే తనకు తెలుగు నేర్చుకునేందుకు కొంత సమయం పడుతుందని చెప్పారు ద్రౌపది ముర్ము(Draupadi Murmu).
అనంతరం రాష్ట్రపతి నేరుగా వనవాసీ కళ్యాణ్ పరిషత్ ఆధ్వర్యంలో ఏ్పాటు చేసిన సమ్మలక్క సారలమ్మ జన్ జాతి పూజారి సమ్మేళనంలో పాల్గొన్నారు.
Also Read : పాలన అస్తవ్యస్తం తెలంగాణ విధ్వంసం