Draupadi Murmu Srisailam : మల్లన్న సేవలో ముర్ము
డిసెంబర్ 30 దాకా హైదరాబాద్ లో బస
Draupadi Murmu Srisailam : ఏపీలోని ప్రముఖ శైవ క్షేత్రంగా విరాజిల్లిన శ్రీశైలం ఆలయాన్ని సందర్శించారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(Draupadi Murmu). ఆమెకు ఘన స్వాగతం పలికారు. భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో మల్లికార్జున స్వామి, భ్రమరాంభికా అమ్మ వార్లను దర్శించుకున్నారు. శీతాకాల విడిదిలో భాగంగా అయిదు రోజుల పాటు అంటే డిసెంబర్ 30 దాకా ఇక్కడే బస చేస్తారు. ఈ సందర్బంగా తెలంగాణ రాష్ట్ర సర్కార్ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది.
ఇప్పటికే గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ , సీఎం కేసీఆర్ స్వాగతం పలికారు. అనంతరం రాజ్ భవన్ లో ఏర్పాటు చేసిన విందుకు పలువురు మంత్రులు హాజరయ్యారు. విచిత్రం ఏమిటంటే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. ఆయన నిరంజన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డితో మాట్లాడడం హాట్ టాపిక్ గా మారింది. మరో వైపు రాష్ట్రపతికి బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ కుమార్ పటేల్ , కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని పరిచయం చేయడం విస్తు పోయేలా చేసింది.
ఇదిలా ఉండగా గవర్నర్ ఇచ్చిన విందుకు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ డుమ్మా కొట్టారు. ఇక బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, టీడీపీ స్టేట్ చీఫ్ కాసాని జ్ఞానేశ్వర్ , సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు హాజరయ్యారు. అంతకు ముందు శ్రీశైలంలో పలు అభివృద్ది పథకాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(Draupadi Murmu) ప్రారంభించారు. మల్లన్నకు రుద్రాభిషేకం చేశారు. చెంచు మహిళలతో ముఖాముఖి నిర్వహించారు. ఆమె వెంట కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఉన్నారు. ఇవాళ కేశవ్ మెమోరియల్ విద్యా సంస్థల విద్యార్థులతో సంభాషిస్తారు ద్రౌపది ముర్ము.
Also Read : ఎపీఎస్ఆర్టీసీ ఖుష్ కబర్