Draupadi Murmu : ద్రౌపది ముర్ము ఘన విజయం
భారత దేశానికి 15వ రాష్ట్రపతి
Draupadi Murmu : భారత రాష్ట్రపతి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము ఘన విజయం సాధించారు. దేశానికి సంబంధించి 15వ రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. రాష్ట్రపతి పదవిని చేపట్టిన తొలి ఆదివాసీ మహిళగా రికార్డు సృష్టించారు.
దేశంలోనే అత్యున్నతమైన పదవిగా భావించే రాష్ట్రపతి పదవికి రెండో మహిళగా నిలిచారు. మొత్తం ఓట్లలో సగానికి పైగా ఓట్లను సాధించింది తనకు ఎదురే లేదని చాటారు.
ఇక ప్రతిపక్షాల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా పోటీ చేశారు. ద్రౌపది ముర్ముకు బీజేపీ, ఎన్డీయే భాగస్వామ్య పక్ష పార్టీలు, బీజేపీ, వైసీపీ సహా మొత్తం 44 పార్టీలు మద్దతు పలికాయి.
ఎలక్టోరల్ కాలేజ్ లో మెజారిటీకి మించి ఓట్లు సాధించారు. 63 శాతం ఓట్లతో గెలుపొందారు ద్రౌపది ముర్ము(Draupadi Murmu). ఈనెల 25న భారత దేశ అత్యున్నతమైన రాష్ట్రపతిగా ఆమె ప్రమాణ స్వీకారం చేస్తారు.
ఇదిలా ఉండగా ద్రౌపది ముర్ము ఆదివాసీ గిరిజన తెగకు చెందిన వ్యక్తి. ఆమె స్వస్థలం ఒడిశా. కష్టపడి చదువుకున్నారు. జూనియర్ అసిస్టెంట్ గా పని చేశారు. అనంతరం కౌన్సిలర్ గా ఎన్నికయ్యారు.
భారతీయ జనతా పార్టీలో క్రియాశీకలంగా ఎదిగారు. జాతీయ స్థాయిలో వివిధ హొదాలలో పని చేశారు. ఒడిశా రాష్ట్రంలో రెండు సార్లు మంత్రి పదవి చేపట్టారు.
ఆమె పనితీరును గుర్తించిన ప్రధాన మంత్రి మోదీ జార్ఖండ్ కు గవర్నర్ గా నియమించారు. 2015 నుంచి పని చేశారు. తాజాగా రాష్ట్రపతిగా అత్యున్నత పీఠం ఎక్కారు.
Also Read : ఫ్యాక్ట్ చెక్ పేరుతో విద్వేషం తగదు